News December 30, 2025
మంచిర్యాల: వార్డుల వారీగా ఓటర్ జాబితా వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలోని వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితా ఎలాంటి అవకతవకలు తావు లేకుండా స్పష్టంగా రూపొందించాలని ఆదేశించారు.
Similar News
News February 4, 2026
సింహాచలం ఈవోగా జె.వెంకటరావు

సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈవోగా సీనియర్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ జె.వెంకటరావును ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం కాకినాడ జిల్లా రెవెన్యూ ఆఫీసర్‌గా ఉన్న ఆయన సేవలను రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖకు అప్పగిస్తూ, తొలుత ఒక సంవత్సరం కాలానికి ఈ బాధ్యతలు అప్పగించింది. అదే సమయంలో అనంతపురం జిల్లా కేఆర్‌ఆర్‌సీలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న డి.తిప్పే నాయక్‌ను కాకినాడ డీఆర్ఓగా నియమించింది.
News February 4, 2026
పులి ఫోటోలు వైరల్ చేస్తే చర్యలు: కలెక్టర్

పులి ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం హెచ్చరించారు. పులి సంచారంపై సమాచారం ఉంటే అటవీ, పోలీస్ శాఖలకు తెలపాలన్నారు. పులిపై దాడి చేయవద్దని సూచించారు. ఫిబ్రవరి 1న పశువులపై జరిగిన దాడి తర్వాత మరే ప్రమాదం జరగలేదని ఆమె స్పష్టం చేశారు. అవాస్తవాలను నమ్మవద్దని కోరారు.
News February 4, 2026
రబీ జొన్నలో కలుపు నివారణకు సూచనలు

జొన్న విత్తిన 30-35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 48 గంటలలోపు ఎకరాకు 800 గ్రా. అట్రజిన్ (50%) పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై సమంగా పిచికారీ చేస్తే 35 రోజుల వరకు కలుపు సమస్య ఉండదు. విత్తిన 30, 60 రోజులకు గుంటక లేదా దంతితో వరుసల మధ్య అంతర కృషి చేసుకోవాలి. దీని వలన కలుపు నివారణతో పాటు తేమ నిలిచి పంట చివరి దశలో బెట్టకు గురికాకుండా ఉంటుంది.


