News April 24, 2024
కాంగ్రెస్‌లోకి వైరా మాజీ ఎమ్మెల్యే..?

వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. నిన్న తన అనుచరులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అధికార పార్టీ నేతల ఆహ్వానం తర్వాతే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తన అనుచరులతో రాములు నాయక్ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Similar News
News March 7, 2026
విద్యాశాఖలో ఖమ్మం జిల్లా నంబర్ 1: కలెక్టర్

విద్యాశాఖ పనితీరులో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ అనుదీప్ వెల్లడించారు. శనివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగంలో జిల్లా సాధించిన ఈ ఘనత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో రాబోయే పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
News March 7, 2026
ఖమ్మంలో న్యాయవాదులకు 40 గంటల మీడియేషన్ శిక్షణ

ఖమ్మం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్‌లో శనివారం న్యాయవాదులకు 40 గంటల మీడియేషన్ శిక్షణ కార్యక్రమాన్ని హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద, జస్టిస్ కె.శరత్ ప్రారంభించారు. కోర్టుల్లో పెండింగ్ కేసులను తగ్గించేందుకు మధ్యవర్తిత్వం కీలకమని వారు పేర్కొన్నారు. ఇరుపక్షాల అంగీకారంతో స్నేహపూర్వకంగా వివాదాలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి రాజగోపాల్ తదితరులున్నారు.
News March 7, 2026
అంధ విద్యార్థిని కృతజ్ఞతలు.. ఖమ్మం కలెక్టర్ భావోద్వేగం

ఖమ్మం జడ్పీ సెంటర్‌లోని నిజాంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న అంధుల ప్రత్యేక పాఠశాలను శుక్రవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించి, అధికారులను పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడ చదువుతున్న విద్యార్థిని భవాని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయగా కలెక్టర్ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆ చిన్నారిని ఆశీర్వదించి చదువులో ముందుకు సాగాలని ప్రోత్సహించారు.


