News December 30, 2025
మహిళా సాధికారతపై పురందీశ్వరి సమీక్ష

తిరువనంతపురంలో మంగళవారం జరిగిన ‘మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ’ సమావేశంలో రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి పాల్గొన్నారు. ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక శాఖ ప్రతినిధులతో కలిసి స్వయం సహాయక సంఘాల పనితీరుపై సమీక్షించారు. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో ఈ సంఘాలు పోషిస్తున్న పాత్రను ఆమె వివరించారు. మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు బ్యాంకులు మరింత తోడ్పాటు అందించాలని ఎంపీ సూచించారు.
Similar News
News January 3, 2026
గోదావరి నదిలో మహిళ గల్లంతు

కొవ్వూరు వంతెనపై శుక్రవారం సాయంత్రం ఇద్దరు మహిళలు గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆటోలో ఇద్దరు మహిళలు చిన్నపిల్లతో వంతెనపై దిగారు. వీరిలో ఒక మహిళ గోదావరిలో దూకి గల్లంతయ్యారు. మరో మహిళను, చిన్నారిని వాహనదారులు అడ్డుకున్నారు. నదిలో గల్లంతయిన మహిళ దేవరపల్లి మండలం దుద్దుకూరు వాసి ఈగల ధనలక్ష్మి(40)గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 2, 2026
‘జిల్లాలో నేటి నుంచి నాలుగో విడత భూ రీసర్వే’

జిల్లాలో నాలుగో విడత భూముల రీసర్వే పక్రియను శుక్రవారం నుంచి ప్రారంభిస్తు న్నట్లు జిల్లా సర్వే భూమి రికార్డుల అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. జిల్లాలో గతేడాది చేపట్టిన మూడు విడతల రీ సర్వేలో 36 గ్రామాల్లో 73,339 ఎకరాల్లో పూర్తి చేసామన్నారు. రాజమహేంద్రవరం డివిజన్లో 8 గ్రామాల్లోనూ, కొవ్వూరు డివిజన్లో 11 గ్రామాల్లోనూ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు తమ వంతు సహకరించాలని ఆయన కోరారు.
News January 2, 2026
తూ.గో: యర్నగూడెం హైవేపై గుర్తు తెలియని మహిళ మృతి

దేవరపల్లి మండలం యర్నగూడెం జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని సుమారు 50 ఏళ్ల మహిళ మృతి చెందింది. వేకువజామున జరిగిన ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతురాలు ఆకుపచ్చ చీర ధరించి, చేతిలో బకెట్, బూడిద గుమ్మడికాయతో ఉన్నట్లు ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు దేవరపల్లి పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.


