News December 30, 2025

HYD: టూర్ ఇప్పుడెందుకు బాస్?

image

పదవి ఊడే టైంలో పిక్నిక్ ఏంటి సామీ.. FEBతో కాలపరిమితి ముగిసే GHMC కార్పొరేటర్లు ఇప్పుడు సడన్‌గా FEB 4th నుంచి 9th వరకు Study Tour చేస్తున్నారు. వీళ్లు వెళ్లి వచ్చేసరికి పదవి ఉండదు.. నేర్చుకున్నది అమలు చేసే టైమూ ఉండదు. మరి రూ.కోట్లాది ప్రజాధనం వృథా ఎవరి కోసం?. రిటైర్ అయ్యే ఉద్యోగులను కూడా ట్రైనింగ్‌కి పంపొద్దనే రూల్ ఉంది. ఈ ‘బైబై టూర్ల’కు బ్రేక్ వేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సర్కారును కోరింది.

Similar News

News January 15, 2026

KKRపై చర్యలకు సిఫారసు.. తిరస్కరించిన ముస్తాఫిజుర్

image

IPL నుంచి BAN ప్లేయర్ ముస్తాఫిజుర్‌ను KKR తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రొటెస్ట్ చేసి కాంపెన్సేషన్ డిమాండ్ చేయాలని అడిగితే ముస్తాఫిజుర్ తిరస్కరించాడని BAN క్రికెటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ Md మిథున్ వెల్లడించారు. క్రికెట్‌కు సంబంధం లేని కారణాలతో కాంట్రాక్ట్ రద్దు చేస్తే చర్యలు తీసుకోవచ్చని వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ చెప్పిందని, కానీ ముస్తాఫిజుర్ వద్దనడంతో వెనక్కి తగ్గామన్నారు.

News January 15, 2026

మెగా సిటీలుగా తిరుపతి, విశాఖ, అమరావతి: CM CBN

image

AP: తిరుపతి చెరువులకు, విజయవాడ కెనాల్స్, విశాఖకు బీచ్‌కు ప్రసిద్ధి అని CM చంద్రబాబు అన్నారు. ఈ మూడింటినీ మెగా సిటీలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాబోయే రోజుల్లో తిరుపతి వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్‌గా మారుతుందని నారావారిపల్లెలో మీడియాతో పేర్కొన్నారు. 2027 నాటికి రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని, ప్రతి నెలా 9న పట్టాదారు పుస్తకాలు అందిస్తామని చెప్పారు.

News January 15, 2026

బాపట్ల: త్రిపురనేని రామస్వామికి చౌదరికి నివాళి

image

నేటి సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి, సమానత్వం వైపు అడుగులు వేయడానికి త్రిపురనేని రామస్వామి చౌదరి జీవితం స్ఫూర్తి అని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతిని పోలీసు అధికారుల ఆధ్వర్యంలో జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులర్పించారు.