News December 30, 2025

శ్రీకాళహస్తి : ఈదురు కాలువలో మహిళ డెడ్ బాడీ

image

శ్రీకాళహస్తి (M) ఊరందూరు చెరువు దగ్గర ఉన్న ST కాలనీ వద్దనున్న ఈదుర కాలువలో మంగళవారం గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యమయింది. పొలం పనులు చేస్తున్న రైతులకు సుమారు 50 నుంచి 60 సం.ల మధ్య వయసుగల మహిళా మృతదేహాన్ని కాలువలో గుర్తించి శ్రీకాళహస్తి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఏరియా హాస్పిటల్‌కి మృతదేహాన్ని తరలించారు. ఆమె చేతిపై హిందీలో అక్షరాలు ఉన్నాయని గుర్తిస్తే పోలీసులను సంప్రదించాలన్నారు.

Similar News

News January 11, 2026

HNK: రేపు ‘అనగనగా ఒక రాజు’ ప్రీ-రిలీజ్

image

నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకకు HNK వేదిక కానుంది. ఈ నెల 12న హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో భారీ వేడుకను నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. నగరంలో సినీ తారల సందడితో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

News January 11, 2026

జనసేనతో పొత్తు అవసరం లేదు: రాంచందర్

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో జనసేనతో BJPకి పొత్తు అవసరం లేదని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు. APలో పరిణామాల ఆధారంగానే కూటమి ఏర్పాటైందని, ఇక్కడ తాము బలంగా ఉన్నట్లు చెప్పారు. పొత్తు ఉంటే జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అధిష్ఠానానికీ ఇదే విషయం చెబుతామన్నారు. కాగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమని JSP నిన్న ప్రకటించింది.

News January 11, 2026

VKB: పండుగ.. మీ పిల్లలు పైలం!

image

సంక్రాంతి వచ్చిందంటే పిల్లల్లో ఆనందం పొంగిపొర్లుతుంది. పతంగులు ఎగురవేయడంలో పరస్పరం పోటీ పడుతూ సంబరాలు చేసుకుంటారు. తెగిపోయిన వాటికోసం పరుగులు పెడుతుంటారు. రోడ్లు, గుంతలు గమనించకుండా పతంగులను పట్టుకోవాలనే ఆత్రుతలో ప్రమాదాలకు ఎదురెళ్తారు. రేలింగ్ లేని బంగ్లాలపై కైట్‌లు ఎగురవేయడం వల్ల గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి.
✦ పేరెంట్స్ పిల్లలపై నజరేయండి. సంక్రాంతిని సంతోషంగా జరుపుకోం