News December 30, 2025

నిబంధనలు పాటించాలి: ఎస్పీ విద్యాసాగర్

image

కృష్ణా జిల్లా ప్రజలకు ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026ను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో అశాంతి, మద్యం తాగి, ర్యాష్ డ్రైవింగ్, డీజేలు, చట్టవిరుద్ధ కార్యక్రమాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీసు తనిఖీలు, పికెట్లు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.

Similar News

News February 3, 2026

గన్నవరం: విద్యార్థులకు గుడ్ న్యూస్

image

వ్యవసాయ విద్యనభ్యసించే విద్యార్థులకు శుభవార్త. గన్నవరంలో నూతన ప్రభుత్వ అగ్రికల్చర్ కాలేజీ ప్రారంభానికి సిద్ధమైంది. అత్యాధునిక ల్యాబ్‌లు, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, హాస్టల్ సౌకర్యాలతో ఈ కళాశాలను తీర్చిదిద్దారు. ప్రయోగాత్మక విద్య, పరిశోధనలకు ఇక్కడ పెద్దపీట వేయనున్నారు. ఈ కళాశాల అందుబాటులోకి రావడం వల్ల స్థానిక విద్యార్థులతో పాటు చుట్టుపక్కల జిల్లాల వారికి వ్యవసాయ రంగంలో మెరుగైన అవకాశాలు లభించనున్నాయి.

News February 3, 2026

కృష్ణా జిల్లా రైతుల్లో కలవరం..!

image

కృష్ణా జిల్లాలో అపరాల సాగు కీలక దశకు చేరుకోగా, ఎలుకల బెడద రైతులను వణికిస్తోంది. పూత, కాయ దశలో ఉన్న పంటను మూషికాలు కొరికి నాశనం చేస్తుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నివారణ చర్యల కోసం గతంలో కంటే మూడు రెట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. వ్యవసాయ శాఖ వెంటనే స్పందించి, ఎలుకల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలని కోరుతున్నారు.

News February 3, 2026

కృష్ణా: ఈ నెల 16 వరకు డిగ్రీ సెమిస్టర్ ఫీజు గడువు

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 4, 6వ సెమిస్టర్‌కు సంబంధించిన రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపులపై వర్సిటీ కీలక ప్రకటన చేసింది. విద్యార్థులు ఈ నెల 16వ తేదీ లోపు తమ కళాశాలల ద్వారా ఫీజు చెల్లించాలని పరీక్షల విభాగం తెలిపింది. అనంతరం 17వ తేదీ వరకు ప్రిన్సిపల్స్ యూనివర్సిటీ పోర్టల్‌లో ఫీజును జమ చేయాల్సి ఉంటుంది. ఆలస్య రుసుముతో 21, 24, 27 తేదీల వరకు అవకాశం కల్పించినట్లు పేర్కొంది.