News December 30, 2025
నాచగిరి క్షేత్రంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

వర్గల్ పరిధి నాచగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి వేడుకలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామునే దేవత మూర్తులను నాచగిరి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయం ఉత్తర ద్వారం వద్ద అధిష్ఠింజేసి, భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, ఈవో విజయ రామారావు పర్యవేక్షణలో వేడుకలు ఘనంగా జరిగాయి.
Similar News
News February 21, 2026
కావలి: రైలు కింద పడి వ్యక్తి మృతి

బిట్రగుంట – అల్లూరు రోడ్డు మధ్యలో శుక్రవారం రాత్రి సుమారు 50-55 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి మృతి చెందాడు. మృతుడు బూడిద రంగు అర చేతుల చొక్క, నల్లని ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుని వివరాలు తెలిసినవారు కావలి GRP పోలీసులను సమాచారం అందించాలని కోరారు.
News February 21, 2026
నిర్మల్: HAPPY 100th BIRTHDAY

నిర్మల్ జిల్లా కడెం మండలం కల్లెడకి చెందిన బియ్యాల లచ్చమ్మ 101వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు శతక జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కూతుళ్లు, మనుమలు, మునిమనుమల మధ్య ఆమె కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. నేటి కాలంలో 50 ఏళ్లు దాటడమే కష్టంగా మారుతున్న తరుణంలో, 100 ఏళ్లు పూర్తి చేసుకున్నా ఆమె ఆరోగ్యంగా ఉండటం విశేషం.
News February 21, 2026
CM నివాసం వద్దే స్నాచింగ్.. కాకినాడ అమ్మాయి అరెస్ట్

జల్సాలకు అలవాటుపడి HYDలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ప్రేమ జంటను పోలీసులు శుక్రవారం అరెస్ట చేశారు. కాకినాడకు చెందిన రేవతి(33), ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేసే GNTకు చెందిన నాని(23) సనత్‌నగర్‌లో గది అద్దెకు తీసుకుని, దొంగతనాలు చేస్తున్నారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్ గొలుసును స్నాచింగ్ చేసిన ఘటనలో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.


