News December 30, 2025
అల్లూరి: ‘నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల కఠిన ఆంక్షలు’

2026 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అల్లూరి జిల్లా పోలీసు శాఖ కఠిన మార్గదర్శకాలు జారీ చేసింది. హోటళ్లు, బహిరంగ ప్రదేశాల్లో అశ్లీల ప్రదర్శనలు, బాణసంచా, డ్రగ్స్ వినియోగం నిషేధమని ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బైక్, కారు రేసింగ్‌లు, అతివేగం నిషేధమన్నారు. డీజే సౌండ్‌పై పరిమితులు విధించామని తెలిపారు.
Similar News
News January 5, 2026
ఓయూ డిగ్రీ పరీక్షా తేదీలు వచ్చేశాయ్!

ఓయూ పరిధిలో జరిగే వివిధ డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్షా తేదీలను విడుదల చేసినట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శశికాంత్ తెలిపారు. BA, BSW, BCom, BSc, BBA రెగ్యులర్ కోర్సుల మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలతో పాటు MA, MCom, MSc, MSW, MLIC, MJ& MC రెగ్యులర్ కోర్సుల 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
News January 5, 2026
కలుషిత నీరు.. 17కి చేరిన మరణాలు

ఇండోర్ భగీరథ్‌పురలో <<18729199>>కలుషిత నీరు<<>> తాగి మరణించిన వారి సంఖ్య 17కి పెరిగింది. తాజాగా ఓం ప్రకాశ్ అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మృతిచెందారు. ఇప్పటివరకు 398 మంది ఆస్పత్రిలో చేరగా 256 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం రేపు కోర్టులో నివేదిక ఇవ్వనుంది. మంచినీటి పైప్ లైన్‌లో మురుగునీరు కలవడమే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం అక్కడి ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
News January 5, 2026
రోజూ 8-10 లీటర్ల పాలిచ్చే ఆవుకు ఎంత మేత ఇవ్వాలి?

సంకర జాతి పశువులకు వాటి పాల ఉత్పత్తిని బట్టి దాణాను అందించాలని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. రోజుకు 8 నుంచి 10 లీటర్ల పాలిచ్చే సంకరజాతి ఆవుకు ఈత ఈనిన తర్వాత లేదా పాలిచ్చే రోజుల్లో రోజుకు 20-30 కేజీల పచ్చగడ్డి, 4-5 కేజీల ఎండుగడ్డి, 4 నుంచి 4.5 కిలోల దాణా మిశ్రమం ఇవ్వాలి. అలాగే ఇదే పశువు వట్టిపోయిన సమయంలో రోజుకు 20-25 కేజీల పచ్చగడ్డి, 6-7 కేజీల ఎండుగడ్డి, 0.5-1 కేజీ దాణా మిశ్రమం ఇవ్వాలి.


