News December 30, 2025

రామగుండం: 12.30AMలోపు వేడుకలు ముగించుకోవాలి: సీపీ

image

నూతన సంవత్సర వేడుకలను 12:30AMలోపు ముగించుకోవాలని సీపీ అంబర్‌ కిషోర్‌ తెలిపారు. 10PM నుంచి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. తాత్కాలిక ఆనందం కోసం భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. చట్టానికి లోబడి ఆనందంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News December 31, 2025

HYD: New Year.. 9490616555 కాల్ చేయండి

image

న్యూ ఇయర్ సంబరాల్లో సామాన్యులను ఇబ్బంది పెట్టే క్యాబ్, ఆటో డ్రైవర్ల ఆటకట్టించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. రైడ్ నిరాకరణ, అదనపు వసూళ్లపై ఫిర్యాదులు వస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనం నంబరు, సమయం తదితర ఆధారాలతో 9490616555 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 178(3)(b) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

NLG: టీఎస్ ఐసెట్ నిర్వహణ MGUకే

image

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి 2026-27 విద్యా సంవత్సరంలో నిర్వహించే ‘టీఎస్ ఐసెట్-2026 నిర్వాహణ బాధ్యతను నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీకే అప్పగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీచేసింది. కాగా ఐసెట్ కన్వీనర్ గా ఎంజీయూ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రొఫెసర్, రిజిస్ట్రార్ ప్రొ. అల్వాల రవిని నియమించారు.