News December 30, 2025
REWIND-2025: విశాఖ అభివృద్ధిలో కీలక మలుపు

2025లో ఉమ్మడి విశాఖ అభివృద్ధి దిశగా కీలక మలుపు తిరిగింది. ఐటీ, పరిశ్రమలు, మౌలిక వసతుల పరంగా రాష్ట్ర ఆర్థిక పటంలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ ఏడాది విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన అంశంగా గూగుల్ డేటా సెంటర్ ప్రకటన నిలిచింది. ఉమ్మడి జిల్లాలో ప్రతిపాదిత మిట్టల్ స్టీల్ ప్లాంట్ పరిశ్రమల రంగంలో కొత్త ఆశలు రేపింది. మొత్తంగా 2025 విశాఖ అభివృద్ధి పునాదులు వేసిన ఏడాదిగా నిలిచింది.
Similar News
News January 22, 2026
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రేపటి నుంచి షబ్బీర్ అలీ పర్యటన

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ మూడు రోజుల పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపు నిజామాబాద్‌లో పాలిటెక్నిక్ ఐటీఐ సందర్శనతోపాటు, నిజామాబాద్ రూరల్, మాక్లూర్ పోలీస్ స్టేషన్ల నూతన భవనాలను ప్రారంభిస్తారు. రాత్రి కామారెడ్డిలో బస చేస్తారు, ఎల్లుండి కామారెడ్డి పట్టణంలోని ఇస్లాంపుర, గ్రీన్ సిటీ, లిటిల్ స్కాలర్ స్కూల్ సమీపంలోని OHSR వాటర్ ట్యాంకులను సందర్శిస్తారు.
News January 22, 2026
నల్గొండ : పీజీ సెమిస్టర్-1 పరీక్షల షెడ్యూల్ విడుదల

ఉమ్మడి నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో PG ( M.A / M.Sc / M.Com / M.S.W ) సెమిస్టర్-1 రెగ్యులర్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 20 మధ్య పరీక్షలు జరుగుతాయని కంట్రోలర్ అఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్. ఉపేందర్ రెడ్డి తెలిపారు. పరీక్ష సెంటర్ లోకి మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు.
News January 22, 2026
కోదాడ: బైక్ అదుపుతప్పి యువకుడు మృతి..

బైక్ అదుపు తప్పి యువకుడు మృతి చెందిన ఘటన కోదాడలో చోటు చేసుకుంది. బుధవారం గౌతమ్ (17) తన స్నేహితుడు సంతోష్‌తో కలిసి బైక్‌పై మద్రాస్ సెంటర్‌కు వెళ్లి వస్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో గౌతమ్‌కు తీవ్ర గాయాలు కాగా, సంతోష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గౌతమ్ గురువారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


