News December 30, 2025
BIG BREAKING: నిజామాబాద్: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు!

TGలో మున్సిపల్ ఎన్నికల సందడి అధికారికంగా మొదలైంది. నిజామాబాద్ కార్పొరేషన్, ఆర్మూర్, భీమ్‌గల్, బోధన్ మున్సిపాలిటీల కమిషనర్లతో ఎన్నికల కమిషనర్ గిరిధర్ సుందర్ బాబు VC నిర్వహించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల లెక్క తేల్చాలని ఆదేశించారు. రిజర్వేషన్ల గెజిట్ వెలువడగానే అధికారిక నోటిఫికేషన్ రానుంది.
SHARE IT
Similar News
News January 2, 2026
నిజామాబాద్: దొంగల కోసం గాలిస్తున్నాం: SI

నిజామాబాద్ 3 టౌన్ పరిధిలో రైతు బజార్ వద్ద గణేశ్ జువెలరీ షాప్‌లో నిన్న రాత్రి దుండగులు దొంగతనం చేయడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని త్రీ టౌన్ SI హరిబాబు తెలిపారు. బ్లూకోట్ కానిస్టేబుల్ షట్టర్ ఓపెన్ ఉండటం గమనించి అటువైపు వెళ్లగా ముగ్గురు దుండగులు పారిపోయరన్నారు. షాపు యజమాని వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News January 2, 2026
NZB: ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ సూసైడ్

నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. MHలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్‌కు చెందిన ఓంకార్(24) ఖలీల్‌వాడీలోని సాయి అశ్విని ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి ఆసుపత్రి బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్పిటల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News January 2, 2026
NZB: అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నుంచి పోటీ చేస్తాం: కవిత

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నుంచి పోటీ చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు స్వీయ రాజకీయ శక్తి అవసరం ఉందన్నారు. మొదటి నుంచి నేను స్వతంత్రంగా పని చేశానని, BRSపై మనసు విరిగిందన్నారు. KCR పిలిచినా మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లేది లేదన్నారు.


