News December 30, 2025
జగిత్యాల: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు!

TGలో మున్సిపల్ ఎన్నికల సందడి అధికారికంగా మొదలైంది. ఎన్నికల కమిషనర్ గిరిధర్ సుందర్ బాబు జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్ మున్సిపాలిటీల కమిషనర్లతో నిర్వహించిన VCలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల లెక్క తేల్చాలని స్పష్టమైన ఆదేశాలు అందాయి.
Similar News
News January 9, 2026
ఖమ్మం: సంక్రాంతి వేళ తస్మాత్ జాగ్రత్త: సీపీ

సంక్రాంతి సెలవులకు ఊరెళ్లే వారు ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ సూచించారు. నగలు బ్యాంక్ లాకర్లలో ఉంచాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఎక్కువ రోజులు తాళం వేసి వెళ్లే వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అనుమానితులు కనిపిస్తే డయల్ 100కు కాల్ చేయాలని తెలిపారు. ప్రయాణాల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.
News January 9, 2026
ఖమ్మం జిల్లాలో పునఃప్రారంభమైన వ్యవసాయ యాంత్రీకరణ!

పదేళ్ల విరామం తర్వాత ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించింది. 2025-26కు గాను ఖమ్మం జిల్లాకు రూ.4.37 కోట్ల రాయితీ నిధులను కేటాయించారు. ఎస్సీ, ఎస్టీలకు 50%, ఇతరులకు 40% రాయితీతో యంత్రాలు అందించనున్నారు. ఇప్పటికే 387 మంది రైతులు డీడీలు చెల్లించగా, తొలి విడతలో 172 యూనిట్లను త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య తెలిపారు.
News January 9, 2026
నిర్మల్: గడువులోగా పిల్లలను ఇంటికి తీసుకెళ్లండి: డీఈవో

నిర్మల్ జిల్లా పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను సంక్రాంతి సెలవుల్లో భాగంగా శుక్రవారం నుంచి ఇండ్లకు పంపించడం జరుగుతుందని డీఈవో భోజన్న తెలిపారు. ఉ.10 నుంచి సా.5 వరకు విద్యార్థులను ఇంటికి పంపించడం జరుగుతుందన్నారు. పేరెంట్స్ తప్పకుండా వచ్చి తమ పిల్లలను తీసుకువెళ్లాలని సూచించారు. సెలవులు ముగిసిన వెంటనే పిల్లలను పాఠశాలకు పంపాలని అన్నారు.


