News December 30, 2025
BIG BREAKING: BNGR: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు!

TGలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా మొదలైంది. ఎన్నికల కమిషనర్ గిరిధర్ సుందర్ బాబు BNGR, ఆలేరు, చౌటుప్పల్, మోత్కూర్, పోచంపల్లి, యాదగిరిగుట్ట పుర కమిషనర్లతో నిర్వహించిన VCలో ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని ఆదేశాలు అందాయి. ఈ రిజర్వేషన్ల గెజిట్ వెలువడగానే అధికారిక నోటిఫికేషన్ రానుంది.
SHARE IT
Similar News
News February 19, 2026
మారే ప్రమాణాలు- మున్ముందు ప్రమాదాలు

నీట్ PGలో 0 మార్కుల అభ్యర్థులకూ అడ్మిషన్ రావడం ఆందోళనకరం. సీట్లు భర్తీ చేయడం, డాక్టర్ల కొరత తీర్చేందుకు ఇలా మార్కులు తగ్గించి అడ్మిషన్లు ఇవ్వడంపై మెడికల్ బాడీస్ సైతం అభ్యంతరం తెలిపాయి. ఇది ఫ్యూచర్‌లో భారత ఆరోగ్య రంగాన్ని ప్రమాదంలోకి నెట్టే చర్యగా అభివర్ణించాయి. అవసరమైతే స్టూడెంట్స్‌కు ట్రైనింగ్, ఫీజు మినహాయింపు, ఇన్సెంటివ్స్ లాంటివి ఇవ్వాలి తప్ప ఇదేం నిర్ణయమని సగటు మనిషి అభిప్రాయం. మీరేమంటారు..?
News February 19, 2026
తిరుపతి కలెక్టర్ కీలక ఆదేశాలు

తిరుపతిలో గ్రీవెన్స్ డే ద్వారా వచ్చే రెవెన్యూ, భూసంబంధిత అర్జీలను పారదర్శకంగా, గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు, రీసర్వే, కుల ధృవీకరణ పత్రాల వంటి సేవలను ఆలస్యం లేకుండా ప్రజలకు అందించాలని సూచించారు. అధికారులు అర్జీదారులతో నేరుగా మాట్లాడి సంతృప్తికర పరిష్కారం అందించాలని కోరారు.
News February 19, 2026
బాపట్ల తీరానికి ‘గోవా’ కళ

బాపట్ల తీరప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ నేతృత్వంలోని బృందం ఫిబ్రవరి 19 నుంచి 22 వరకు గోవాలో పర్యటించనుంది. తీర ప్రాంత నిర్వహణ, పర్యాటక మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రమాణాలను పరిశీలించి, బాపట్ల తీరాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఈ బృందం 22న తిరిగి విజయవాడకు చేరుకోనుంది.


