News December 30, 2025

నంద్యాల: విషాదం.. తల్లి, కుమార్తె మృతదేహాలు లభ్యం

image

గడివేముల మండలంలోని ఉండుట్ల గ్రామానికి చెందిన లక్ష్మీదేవి తన ఇద్దరు పిల్లలతో ఈనెల 28న ఎస్సార్‌బీసీ కాలువలో దూకిన ఘటనలో మంగళవారం విషాదం నెలకొంది. ఎస్సై నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన గాలింపు చర్యల్లో లక్ష్మీదేవి, ఆమె కుమార్తె వైష్ణవి మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే, నాలుగు నెలల చిన్నారి సంగీత ఆచూకీ ఇంకా లభించలేదని పోలీసులు తెలిపారు. చిన్నారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Similar News

News January 2, 2026

ఆరోగ్యాన్నిచ్చే వామకుక్షి.. చేసే విధానమిదే!

image

వామకుక్షి అంటే భోజనం చేసిన తర్వాత ఎడమ వైపునకు తిరిగి పడుకోవడం. ముందుగా వెల్లకిలా పడుకుని, ఆపై నెమ్మదిగా ఎడమ వైపునకు ఒరగాలి. కుడి కాలును ఎడమ కాలుపై ఉంచాలి. మీ ఎడమ చేతిని తల కింద దిండులా అమర్చుకోవాలి. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. మరీ గాఢ నిద్రలోకి వెళ్లకుండా, 15 నుంచి 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవడమే వామకుక్షి. ఇది ప్రాచీన ఆయుర్వేదం సూచించిన అత్యుత్తమ జీవనశైలి పద్ధతి. SHARE IT

News January 2, 2026

సంగారెడ్డి: ‘దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే రూ.లక్ష’

image

దివ్యాంగులను దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే రూ.లక్ష ప్రోత్సాహం అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని సంగారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి గురువారం తెలిపారు. 19-5-2025 తర్వాత పెళ్లి చేసుకున్న వారికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. అర్హులైన వారు http://telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

News January 2, 2026

రంపచోడవరం: ‘రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి’

image

రంపచోడవరం మండలం దేవరాతిగూడెం గ్రామానికి చెందిన చోడి దుర్గాప్రసాద్ (25) గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తన అత్తగారి ఊరు అయిన గొడ్ల గూడెం గ్రామం నుంచి బైక్‌పై స్వగ్రామం వస్తుండగా సుద్దగూడెం గ్రామం వద్ద అదుపు తప్పి రోడ్డుపై పడ్డాడని గ్రామస్థులు చెప్పారు. ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు.