News December 31, 2025

విజయవాడ: స్వల్పంగా పెరిగిన చైన్ స్నాచింగ్ కేసులు

image

2025లో విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆస్తి నేరాల్లో స్పష్టమైన తగ్గుదల నమోదైంది. డెకాయిట్ కేసులు 2 నుంచి 0కి, రోబరీ కేసులు 35 నుంచి 14కు, రాత్రి గృహభేధనలు 158 నుంచి 96కు, సాధారణ దొంగతనాలు 859 నుంచి 623కు తగ్గాయి. పగలు గృహభేధనలు 37 నుంచి 36కు స్వల్పంగా తగ్గాయి. అయితే లాభం కోసం హత్యలు 2 నుంచి 3కు, స్నాచింగ్ కేసులు 55 నుంచి 58కు కొద్దిగా పెరిగాయి.

Similar News

News January 3, 2026

మహబూబ్‌నగర్ జిల్లా ముఖ్యాంశాలు

image

✒ఓపెన్ SSC, INTER.. ఫీజు చెల్లించండి
✒సౌత్ జోన్.. పీయూ యోగ జట్టు రెడీ
✒జడ్చర్ల: అనుమానాస్పదంగా బాలిక మృతి
✒రాబోయే ఎన్నికల్లో అధికారం బీజేపీదే:డీకే అరుణ
✒రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన
✒MBNR: సంక్రాంతి పండుగ.. ప్రత్యేక బందోబస్తు:SP
✒ప్రారంభమైన టెట్ పరీక్ష
✒పాలమూరు వర్సిటీ క్యాలెండర్ ఆవిష్కరణ
✒రెబల్‌గా పోటీ చేస్తే సస్పెన్షన్:మల్లు రవి
✒గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

News January 3, 2026

HYD: యువతలో సరికొత్త క్రేజ్.. ‘ఫాల్కన్ విస్పర్స్’!

image

నగర యువత (Gen-Z) పార్టీల పేరుతో మద్యం, సందడికి దూరంగా ‘ఫాల్కన్ విస్పర్స్’ అనే వినూత్న ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. శంషాబాద్ తోటల్లో గుట్టుగా కలుస్తూ ఒత్తిడిని వీడటమే దీని లక్ష్యం. 800 మంది సభ్యులున్న డెక్కన్ షాడోస్ టెలిగ్రామ్ గ్రూపు దీనికి వేదికైంది. ఇక్కడ సెల్ఫీలు ఉండవు. కేవలం మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా ఏకాగ్రత 35% పెరుగుతుందని యువత నమ్ముతున్నారు. ఈ ‘సోబర్’ మీటింగ్స్ ఇప్పుడు హాట్ టాపిక్!