News December 31, 2025
జనవరి 17 నుంచి ‘సీఎం కప్’ క్రీడా పోటీలు

హైదరాబాద్: ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘సీఎం కప్ 2025’ క్రీడా పోటీలు జనవరి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రామ పంచాయతీ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయుల్లో ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ఆధార్ కార్డు, ఫొటోతో https://satg.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News January 9, 2026
PMV 480(అల్లూరి).. అధిక పోషకాల వరిగ రకం

‘వరిగ’ ఒక రకమైన చిరుధాన్యం. వీటిలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని అన్నం, అట్లు, మురుకుల తయారీలో ఉపయోగిస్తారు. విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించిన PMV 480(అల్లూరి) రకం వరిగ వంగడాన్ని తాజాగా విడుదల చేశారు. దీని పంటకాలం 72-77 రోజులు. ఇది ఖరీఫ్‌కు అనుకూలం. హెక్టారుకు 2.27 టన్నుల దిగుబడి వస్తుంది. మిగిలిన వాటి కంటే ఈ రకంలో ప్రొటీన్ శాతం అధికం.
News January 9, 2026
IIT ఇండోర్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News January 9, 2026
HYD: RTC స్పెషల్ బస్సులు.. 50% స్పెషల్ రేట్లు

సిటీ నుంచి సంక్రాంతికి సొంతరు వెళ్లేందుకు నగరవాసి సిద్ధమవుతున్నాడు. అయితే ఆర్టీసీ ప్రత్యేకంగా నడుపుతున్న బస్సుల్లో టికెట్లకు స్పెషల్ రేట్లు ఉంటాయి. అంటే అదనంగా 50% వసూలు చేస్తారన్నమాట. పండగ సమయాల్లో అదనపు ఛార్జీ వసూలుకు సంబంధించి గతంలోనే ప్రభుత్వం అనుమతులిస్తూ జీవో 50 జారీ చేసింది. ఈ మేరకే ప్రత్యేక దిన్నాల్లో RTC స్పెషల్ రేట్స్ అమలు చేస్తుంది. అయినా.. అవసరం ప్రజలది.. అవకాశం పాలకులది కదా.


