News December 31, 2025

మోడర్న్ వెపన్స్ కొనుగోలుకు రూ.4,666కోట్ల ఒప్పందాలు

image

రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. తాజాగా రూ.4,666Crతో క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైన్స్, హెవీ వెయిట్ టార్పడోస్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు భారత్ ఫోర్జ్ లిమిటెడ్, PLR సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. 2030 నాటికి ఇవి డిఫెన్స్‌కు అందనున్నాయి. కాగా 2025-26 వార్షిక ఏడాదిలో రక్షణ రంగానికి కేంద్రం రూ.1,82,492 కోట్లను కేటాయించింది.

Similar News

News February 11, 2026

రాహుల్‌ గాంధీకి కేంద్రం అల్టిమేటం

image

లోక్‌సభలో LoP రాహుల్ గాంధీ <<19110209>>వ్యాఖ్యలు<<>> తీవ్ర దుమారం రేపాయి. మోదీ, హర్దీప్ సింగ్ పూరీపై ఆయన అసత్య ఆరోపణలు చేశారంటూ కేంద్రం సభాహక్కుల ఉల్లంఘన తీర్మానానికి సిద్ధమైంది. సాయంత్రం 5 గంటలలోపు రాహుల్ స్పీకర్ కార్యాలయంలో హాజరుకావాలని అల్టిమేటం జారీ చేసింది. మరి దీనిపై ప్రతిపక్ష నేత ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠగా మారింది.

News February 11, 2026

గ్రూప్-1పై హైకోర్టు కీలక ఆదేశాలు

image

AP: గ్రూప్-1 పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అక్రమాలను నిగ్గుతేల్చేందుకు సిట్ వేయాలని హైకోర్టు ఆదేశించింది. అడిషనల్ DG స్థాయి అధికారితో సిట్ విచారణ జరపాలని వ్యాఖ్యానించింది. ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయా లేదా అని ఫోరెన్సిక్ నిపుణులతో నిర్ధారించాలని ఆదేశించింది. మార్చి 16వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని HC ఆదేశాలు జారీ చేసింది.

News February 11, 2026

ఇలా చేస్తే గ్యాస్ సిలిండర్ లీక్ అవుతుంది!

image

గ్యాస్ సిలిండర్ నిండుగా ఉన్నప్పుడు చాలామంది దానిని కింద పడుకోబెట్టి భద్రపరుస్తుంటారు. అయితే ఇలా చేయడం అత్యంత ప్రమాదకరమని కేంద్ర పెట్రోలియం శాఖ హెచ్చరిస్తోంది. సిలిండర్‌ను పడుకోబెట్టడం వల్ల గ్యాస్ లీకేజీ అయి అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. గ్యాస్ లీకేజీలను అరికట్టేందుకు సిలిండర్‌ను ఎల్లప్పుడూ నిలువుగానే ఉంచాలని సూచించింది. SHARE IT