News December 31, 2025
VJA: క్లౌడ్ పెట్రోలింగ్.. 42 డ్రోన్స్‌తో నగరంలో జల్లెడ

విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజా భద్రత కోసం క్లౌడ్ పెట్రోలింగ్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో 41 డ్రోన్లు అందుబాటులో ఉండగా, మొత్తం 5,790 డ్రోన్ బీట్‌లు నిర్వహించారు. వీటిలో పండుగలు, ర్యాలీలు, విద్యాసంస్థలు, వీఐపీ విధులు, గుంపుల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దసరా ఉత్సవాలు, భవాని దీక్షలు విజయవంతం కావడానికి సాంకేతిక పరిజ్ఞానం కారణం.
Similar News
News January 1, 2026
వంటింటి చిట్కాలు

* బంగాళదుంపలకు మొలకలు రాకుండా ఉండాలంటే, చేతులకు కాస్త ఆయిల్ రాసుకొని వాటికి రుద్దాలి.
* గోధుమ పిండి, శెనగపిండి వంటివి పురుగు పట్టకుండా ఉండాలంటే, డబ్బాలో బిర్యానీ ఆకులు వేసి ఉంచాలి.
* కాకరకాయ ముక్కలు చేదు పోవాలంటే పెరుగు, గోధుమ పిండి, ఉప్పు కలిపిన మిశ్రమంలో కాసేపు ఈ ముక్కల్ని నానబెట్టి తరువాత వండాలి.
* తీపి పదార్థాలు చేస్తున్నప్పుడు చిటికెడు ఉప్పు వేయడం మరవకండి. పదార్థాలు మంచి రుచిగా ఉంటాయి.
News January 1, 2026
BEMLలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<
News January 1, 2026
కోతితో సినిమా చేస్తున్న మురుగదాస్!

స్టార్ హీరోలతో పలు హిట్ చిత్రాలు తీసిన డైరెక్టర్ AR మురుగదాస్ ఇటీవల వరుస ఫ్లాప్‌లను చూశారు. రజనీకాంత్‌తో ‘దర్బార్’, సల్మాన్‌తో ‘సికిందర్’, శివకార్తికేయన్‌తో ‘మదరాసి’ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వినూత్న ప్రయోగానికి సిద్ధమయ్యారు. తన నెక్స్ట్ సినిమాలో కోతిని లీడ్ రోల్‌గా చూపించనున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ పూర్తిగా పిల్లల కోసం ఉంటుందని తెలిపారు. దీనిని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.


