News December 31, 2025
NTR: ‘డిజిటల్ అరెస్ట్’.. సాంకేతికతతో పటిష్ఠ నిఘా

విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ‘డిజిటల్ అరెస్ట్’ సహా సైబర్ మోసాలను అరికట్టేందుకు ఆధునిక సాంకేతికతతో పటిష్ఠ నిఘా కొనసాగుతోంది. సైబర్ సురక్ష-కస్టమర్ సైబర్ సేఫ్టీ వెరిఫికేషన్ సిస్టమ్‌లో భాగంగా Police Analytics Dashboard ద్వారా ఫిర్యాదులు, నమోదులను రియల్‌టైమ్‌లో విశ్లేషిస్తున్నారు. ఈ వ్యవస్థ అమలుతో ప్రజల నుంచి వచ్చే సమాచారం వేగంగా నమోదు కావడంతో మోసాలపై తక్షణ చర్యలు తీసుకునే అవకాశం కలుగుతోంది.
Similar News
News February 10, 2026
‘నానో అమోనియా యూరియా వినియోగం పెరుగుతోంది’

రాష్ట్రంలో నానో యూరియా, డీఏపీ వినియోగం పెరుగుతోందని కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో కాకినాడ ఎంపీ సానా సతీశ్ రాష్ట్రంలో యూరియా వినియోగం, నానో ఎరువుల లభ్యత పై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారని ఎంపీ కార్యాలయం తెలిపింది. సీజన్ల వారీగా పరిశీలిస్తే ప్రతి సీజన్ కు ఈ వినియోగం పెరుగుతోందని, ఇది శుభ పరిణామం అని మంత్రి ప్రకటించినట్లు ఎంపీ తెలిపారు.
News February 10, 2026
ములుగు మున్సిపాలిటీలో 19 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు

తొలిసారి ఎన్నికలు జరుగుతున్న ములుగు మున్సిపాలిటీలో మొత్తం 20 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ఒక్క జీవంతరావుపల్లి MPPS కేంద్రం మినహా 19 కేంద్రాలను అధికారులు అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. 150 మంది పోలీసులతో బందోబస్త్ ఏర్పాటు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఛైర్మన్ పీఠంపై కన్నేయడంతో పోటీ తీవ్రంగా ఉంది. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు.
News February 10, 2026
పుంగనూరు: రౌడీషీటర్ దారుణ హత్య

పుంగనూరు మండలం మసేమ్మ కురప్పల్లికి చెందిన రౌడీ షీటర్ డిజే.భాస్కర్ దారుణ హత్యకు గురయ్యాడు. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో హత్యకు గురై ఉండగా స్థానికులు గుర్తించారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మృతుడిపై పలు కేసులు నమోదు అయినట్లు సమాచారం. ఘటనపై నంగిలి పోలీసులు కేసు దర్యాప్తు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


