News April 24, 2024

కామారెడ్డి : మంటలంటుకుని రైతు మృతి

image

బీర్కూర్ మండల కేంద్రానికి అరిగె చిన్నరాములు(64) అనే వ్యక్తి తన పొలంలోని వరికొయ్యలకు సోమవారం నిప్పుపెట్టాడు. దీంతో భారీగా పొగ అతన్ని తాకడంతో సృహతప్పి పొలంలోనే పడిపోయాడు. మంటలు చెలరేగి అతన్ని చుట్టు ముట్టడంతో చిన్నరాములు సజీవ దహనమయ్యాడు. ఉదయం పొలానికి వెళ్లిన రాములు ఇంకా రాలేదని అతని కుమారుడు పొలం వెళ్లి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Similar News

News January 1, 2026

NZB: న్యూ ఇయర్.. న్యూ కలెక్టర్ ముందున్న సవాళ్లు

image

నిజామాబాద్ జిల్లాకు కొత్త కలెక్టర్‌గా ఇలా త్రిపాఠి బుధవారం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే కొత్త సంవత్సరం ముందు కొత్త కలెక్టర్ ముందు ఉన్న సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ముఖ్యంగా మున్సిపల్, పరిషత్ ఎన్నికలను ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలి. అధికారులతో సమన్వయం చేసుకోవాలి. ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలయ్యేలా చూడాలి. అయితే ఆమె నల్గొండ జిల్లాలో సమర్థవంతంగా పని చేశారు.

News January 1, 2026

NZB: న్యూ ఇయర్ కేక్ కోసిన సీపీ

image

నిజామాబాద్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అర్ధరాత్రి నూతన సంవత్సర స్వాగత సంబరాలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కేకు కోసి నగర పోలీస్ అధికారులకు తినిపించారు. ఒకరికొకరు కేక్ తినిపించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బస్వా రెడ్డి, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.

News January 1, 2026

NZB: వరుస దొంగతనాలు.. సీపీ కీలక సూచనలు

image

నిజామాబాద్ జిల్లాలో ఇటీవల ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల్లో జరుగుతున్న దొంగతనాల ఘటనలపై సీపీ సాయి చైతన్య సమీక్షించారు. నగరంలోని పోలీసు కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో బ్యాంకు సిబ్బంది, క్యాష్ సప్లై చేసే ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఏటీఎం సెంటర్లలో సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చూడాలని, అలారం వ్యవస్థను, సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేయాలని సూచించారు.