News December 31, 2025
శిల్పారామంలో పార్కింగ్‌కు వేలం పాట

అనంతపురం శిల్పారామంలో 2026 జనవరి 1 నుంచి పార్కింగ్ యాక్టివిటీ నిర్వహణకు టెండర్‌లు ఆహ్వానిస్తున్నారు. ఈ టెండర్ ప్రక్రియ డిసెంబర్ 31, 2025న మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య శిల్పారామం పరిపాలన అధికారి కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఆసక్తిగలవారు 88866 52051, 63090 29590 నంబర్లకు సంప్రదించాలని పరిపాలన అధికారి శివప్రసాద్ రెడ్డి వివరించారు.
Similar News
News January 1, 2026
ATP: చేతివాటం ప్రదర్శించిన బేకరీల యజమానులు

నూతన సంవత్సర వేడుకల వేళ జిల్లాలోని కొందరు బేకరీ షాపుల యజమానులు చేతివాటం ప్రదర్శించారు. లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ శంకర్ తనిఖీలు చేపట్టగా తూకాల్లో మోసం వెలుగు చూసింది. 1 కిలో కేక్‌కి 200 గ్రాములు తగ్గింది. కణేకల్, ఉరవకొండ, విడపనకల్లులో తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు. కణేకల్లులోని 2 షాపుల్లో రూ.20 వేలు, ఉరవకొండలో 4 షాపుల్లో రూ.41వేలు, విడపనకల్లులో 3 షాపుల్లో రూ. 27వేలు జరిమానా విధించారు.
News January 1, 2026
ATP: స్నేహానికి చిరునామా.. న్యూఇయర్ గ్రీటింగ్ కార్డ్స్

న్యూ ఇయర్ అంటేనే ఒకప్పుడు చిన్నారులు, యువత గ్రీటింగ్ కార్డ్స్‌తో సందడి చేసేవారు. దుకాణాల్లో ఛార్ట్స్ కొని ఫ్రెండ్స్‌కు అందించి విషెస్ చెప్పి ఆనందంగా గడిపేవారు. కార్డులు ఇవ్వకపోతే కొత్త ఏడాది రానట్టే అన్నట్లు ఫీలైనవారు ఎంతోమంది. తమకు ఇష్టమైన నటీనటులు, ఫ్లవర్స్ వంటి కార్డులు కొనేవారు. టెక్నాలజీ యుగంలో కంప్యూటర్ గ్రీటింగ్సే దిక్కయ్యాయి. మరి ఆ కార్డుల అనుభూతి మీరు పొందారా? కామెంట్ చేయండి..!