News December 31, 2025
KMR: రుణ లక్ష్య సాధనపై బ్యాంకులకు కలెక్టర్ ఆదేశాలు

కామారెడ్డి జిల్లాలో సెప్టెంబర్-2025 త్రైమాసికానికి సంబంధించి DCC & DLRC సమీక్ష మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వ్యవసాయ పంట రుణాలు, టర్మ్ లోన్లు, మౌలిక సదుపాయాల రుణాలు, MSME, గృహ రుణాల లక్ష్య సాధనపై సమీక్షించారు. పంట రుణాల పంపిణీ, పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వాలని PMEGP, PMFME కింద పెండింగ్ దరఖాస్తులు వెంటనే క్లియర్ చేయాలని బ్యాంకు మేనేజర్లను ఆదేశించారు.
Similar News
News December 31, 2025
కాకినాడ ఎంపీ రిపోర్ట్ కార్డ్ ఇదే!

కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ 2025లో కనబరిచిన అత్యుత్తమ పనితీరును పార్లమెంటు బుధవారం వెల్లడించింది. ఆయన మొత్తం 90 శాతం హాజరు నమోదు చేయగా, 17 చర్చల్లో పాల్గొని 58 ప్రశ్నలు సంధించారు. ఇటీవల ముగిసిన శీతాకాల సమావేశాలకు 100 శాతం హాజరై తన నిబద్ధతను చాటుకున్నారు. ఎంపీ పనితీరుపై పార్టీ నాయకత్వం హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం. నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో ఆయన చొరవ చూపుతున్నారు.
News December 31, 2025
2025లో కన్నుమూసిన యాక్టర్లు

ఈ ఏడాది పలువురు సినీ తారలు నింగికెగిశారు. కోటా శ్రీనివాసరావు (జులై 13), ఫిష్ వెంకట్ (JUL 18), నటి చిత్తజల్లు కృష్ణవేణి (FEB 16), నటి&గాయని బాలసరస్వతీ దేవి(OCT 15), బాలీవుడ్ యాక్టర్లు మనోజ్ కుమార్ (APR 4), ధర్మేంద్ర (NOV 24), గోవర్ధన్ అస్రాని, ముకుల్ దేవ్, తమిళ నటులు రాజేశ్, రోబో శంకర్, మదన్ బాబ్, మలయాళ నటులు విష్ణుప్రసాద్, శ్రీనివాసన్, దక్షిణాది నటి సరోజా దేవి తదితరులు కన్నుమూశారు.
News December 31, 2025
నాగర్‌కర్నూల్: ట్రాన్స్ జెండర్ పథకం ప్రారంభం

నాగర్ కర్నూల్ జిల్లాలో ట్రాన్స్ జెండర్ పథకం 2025 ప్రారంభించడం జరిగిందని జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు ఆర్థిక పునరవాసం కింద రెండు యూనిట్లు మంజూరయ్యాయని ఒక్కొక్కరికి రూ.75 వేల చొప్పున ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలోని ట్రాన్స్ జెండర్స్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ట్రాన్స్ జెండర్స్ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు


