News April 24, 2024

ఈ ఎంపీ అభ్యర్థులు చాలా రిచెస్ట్

image

తెలుగు రాష్ట్రాల్లో పలువురు అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థులుగా నిలుస్తున్నారు. గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రూ.5,598.65 కోట్లతో రిచెస్ట్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. తర్వాతి స్థానాల్లో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ₹4,568 కోట్లు, నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ₹715.62 కోట్లు, కడప కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల ₹182 కోట్లతో ఉన్నారు.

Similar News

News April 1, 2026

రేపటి నుంచి JEE మెయిన్ సెషన్-2.. ఇవి తప్పనిసరి

image

దేశవ్యాప్తంగా గురువారం (ఏప్రిల్ 2) నుంచి జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2, 4, 5, 6, 8 తేదీల్లో పేపర్ 1 (బీఈ/బీటెక్) ఎగ్జామ్స్ జరగనున్నాయి. 9AM-12PM, 3PM-6PM రెండు షిఫ్టుల్లో పరీక్షలు ఉంటాయి. అరగంట ముందే కేంద్రానికి చేరుకుంటే ఉత్తమం. అడ్మిట్ కార్డుతో పాటు రెండు ఫొటోలు, ప్రభుత్వ ఐడీ ప్రూఫ్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News April 1, 2026

‘మీ సేవ’ ఛార్జీల పెంపు

image

TG: ‘మీ సేవ’ కేంద్రాల ద్వారా అందించే వివిధ ధ్రువపత్రాలు, ఇతర సేవలకు ప్రభుత్వం ఛార్జీలు పెంచింది. నేటి నుంచే అవి అమల్లోకి వచ్చాయి. ఇప్పటివరకు రూ.35గా ఉన్న కనీస ఛార్జీని రూ.62కి పెంచింది. A కేటగిరీ సేవలకు రూ.62 చొప్పున, B కేటగిరీ సర్వీసులకు రూ.80 చొప్పున రుసుమును నిర్ణయించింది. B- కేటగిరీలో కమ్యూనిటీ, ఇన్‌కమ్, రెసిడెన్స్, రేషన్ కార్డు, OBC, EWS సర్టిఫికెట్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తదితర సేవలున్నాయి.

News April 1, 2026

ఇరాన్‌ యుద్ధం.. అమెరికాతో విభేదించిన బ్రిటన్

image

ఇరాన్ యుద్ధం విషయంలో <<19525908>>అమెరికా<<>>తో బ్రిటన్ విభేదించింది. ఈ ఘర్షణల్లోకి ప్రవేశించేది లేదని PM స్టార్మర్ తేల్చి చెప్పారు. యుద్ధంతో సంబంధం లేనప్పటికీ.. తమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఘర్షణల్ని ఆపేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. హార్ముజ్ పున:ప్రారంభానికి ఉన్న మార్గాల్ని అన్వేషించేందుకు గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని తెలిపారు.