News April 24, 2024

సురేశ్‌ షెట్కార్‌ ఆస్తులు.. 3.5కిలోల బంగారం, 60 ఎకరాల భూమి 

image

జహీరాబాద్ కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్‌ షెట్కార్‌ తన కుటుంబ ఆస్తులు రూ.10.77కోట్లగా ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. చరాస్తుల విలువ రూ. 3.20 కోట్లు, స్థిరాస్తుల విలువ రూ.7.57 కోట్లు. ప్రైమ్‌ ఫుడ్‌ టెక్‌ ప్రై.లిమిటెడ్‌లో రూ.20 లక్షల విలువైన షేర్లు, ఆయన సతీమణి పేరిట 3.5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఖేడ్‌, సంగారెడ్డిలో కలిపి 60.08 ఎకరాల వ్యవసాయ, ఖేడ్‌లో అర ఎకరా వ్యవసాయేతర భూమి, 2 ఇళ్లు ఉన్నాయి.

Similar News

News March 4, 2026

మెదక్: రేపటి నుంచి జనగణన శిక్షణకు డీఎస్ఓ

image

మెదక్ జిల్లా సైన్స్ అధికారి(DSO) రాజిరెడ్డి బుధవారం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. రేపటి నుండి హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో జరిగే జనగణన శిక్షణకు తాను హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే వేసవిలో చేపట్టనున్న మొదటి దశ ఇళ్ల గణనను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందని రాజిరెడ్డి వెల్లడించారు.

News March 4, 2026

జాతీయ క్రికెట్‌లో కానిస్టేబుల్ సాయి సత్తా.. ఎస్పీ సన్మానం

image

జాతీయ స్థాయి క్రికెట్ క్రీడాకారుడు, కానిస్టేబుల్ సాయి కుమార్‌ను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఘనంగా సన్మానించి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఇటీవల తిరుపతిలో జరిగిన సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్‌లో సాయి అద్భుత ప్రదర్శనతో జట్టును సెమీ ఫైనల్‌కు చేర్చారు. క్రీడల్లో రాణిస్తూ పోలీస్ శాఖకు పేరు తెచ్చినందుకు ఎస్పీ ఆయనను అభినందించారు.

News March 4, 2026

మెదక్: ఈ మండలాల్లో రేపు, ఎల్లుండి నీటి సరఫరా బంద్

image

మెదక్ జిల్లాలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనుల కారణంగా ఈనెల 5, 6న పలు ప్రాంతాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ నాగభూషణం తెలిపారు. మెదక్ నియోజకవర్గంలోని 275 గ్రామాలు, మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలతో పాటు అల్లాదుర్గ్, టేక్మాల్ మండలాల్లోని 80 ఆవాసాలకు నీటి సరఫరా ఉండదన్నారు. ముందస్తు సమాచారాన్ని సర్పంచ్‌లకు చేరవేశామని, ప్రజలు పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు.