News April 24, 2024

పద్మశ్రీ అవార్డు అందుకున్న గడ్డం సమ్మయ్య 

image

దేవరుప్పుల మండలంలోని అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గడ్డం సమ్మయ్య రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పద్మశ్రీ అవార్డు గ్రహీత సమ్మయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. అవార్డు రావడంతో నాపై బాధ్యత మరింత పెరిగిందని గడ్డం సమ్మయ్య అన్నారు.

Similar News

News March 22, 2026

వరంగల్ జిల్లాలో మాంసం ప్రియులకు షాక్!

image

వరంగల్ జిల్లాలో మాంసంప్రియులకు షాక్ తగిలింది. ఆదివారం చికెన్ ధరలు భారీ ధర పలికాయి. విత్ స్కిన్ కేజీ రూ.310-320 ఉండగా, స్కిన్‌లెస్ ధర రూ.340-350 వరకు పలుకుతోంది. లైవ్ కోడి కేజీ రూ.210-230 మధ్య విక్రయిస్తున్నారు. కాగా, నగరంతో పోలిస్తే పల్లెల్లో రూ.10-20 ధర వ్యత్యాసం ఉంది. పెరిగిన నిత్యవసర సరుకుల ధరలు, కోళ్ల సప్లై తక్కువ ఉండడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

News March 21, 2026

మొక్కజొన్నకు రూ.2,400 మద్దతు ధర: కలెక్టర్

image

మొక్కజొన్నకు క్వింటాకు రూ.2,400 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ సత్య శారద తెలిపారు. రైతులు పంటను విక్రయించేటప్పుడు తేమ శాతం (మాయిశ్చర్) 14 లోపు ఉండేలా చూసుకోవాలని సూచించారు. రైతులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని కోరారు. రైతుల ఖాతాల్లో సకాలంలో డబ్బులు జమ అయ్యేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.

News March 21, 2026

WGL: నాలుగు మండలాల్లోనే వర్షం

image

వరంగల్ జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షపాతం సగటున 0.9 మిల్లీమీటర్లు నమోదుకగా, జిల్లా వ్యాప్తంగా 4.9 మిల్లీమీటర్లు వర్ష పాతం నమోదైంది. జిల్లాలోని 13 మండలాల్లో సంగేంలో 1.8 మిల్లీమీటర్లు, కిలా వరంగల్‌లో 1.5 మిల్లీమీటర్లు, వరంగల్‌లో 0.8 మిల్లీమీటర్లు, గీసుకొండలో 0.8 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదుకగా, మిగిలిన 9 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు.