News December 31, 2025
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం.. ఇదే!

మార్కాపురంను నూతన జిల్లాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే మార్కాపురం పట్టణంలోని తర్లపాడు రోడ్డులో గల రిహాబిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్ కాలనీలో ఉన్న భవనాన్ని కలెక్టర్ కార్యాలయంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యాలయం నుంచి పరిపాలన వ్యవహారాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం భవనానికి నూతన హంగులనిచ్చారు.
Similar News
News January 9, 2026
ఈనెల 14న ఉమ్మడి ప్రకాశం జిల్లా షటిల్ టోర్నమెంట్

పర్చూరులోని NTR క్రీడా వికాస కేంద్రంలో ఈ నెల 14న మెన్ డబుల్స్ షటిల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్ సమీవుల్లా తెలిపారు. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. విజేతలకు 1వ బహుమతిగా రూ.15,116లు, 2వ బహుమతి రూ.10,116లు, 3వ బహుమతి రూ.5,116లు, 4వ బహుమతి రూ.3,116లగా నిర్ణయించినట్లు చెప్పారు. వివరాలకు స్టేడియం నిర్వాహకులను సంప్రదించాలన్నారు.
News January 9, 2026
ప్రకాశం: రుణాలు పొందిన వారికి గుడ్ న్యూస్

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కే అర్జున్ నాయక్ కీలక సూచనలు చేశారు. ప్రకాశం జిల్లాలో కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు పొందిన వారు కొవిడ్-19 కారణంగా గతంలో రుణాలు చెల్లించలేదన్నారు. అటువంటి వారి కోసం ప్రస్తుతం వడ్డీ రద్దుతో నగదు చెల్లించే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 30లోగా రుణాలు వడ్డీ లేకుండా చెల్లించి రుణాలను మాఫీ చేసుకోవచ్చన్నారు.
News January 8, 2026
సానుకూల దృక్పథం ఏర్పడేలా చూడాలి: కలెక్టర్

రవాణా శాఖలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది ప్రవర్తన, ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా ఉండాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో రవాణా శాఖ అధికారులతో గురువారం కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాస్థాయిలో రవాణా శాఖపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఏర్పడేలా చూడాలన్నారు.


