News December 31, 2025
న్యూ ఇయర్ వేడుకలకు దూరం

న్యూ ఇయర్ వేడుకలకు ఈ ఏడాది దూరంగా ఉండనున్నట్లు పరిటాల కుటుంబం ప్రకటించింది. ఈ మేరకు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల తమ కుటుంబ సభ్యుడు గుంటూరు రామాంజినేయులు అమెరికాలో మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతపురం, వెంకటాపురం, ధర్మవరంలో ఎక్కడా వేడుకలు నిర్వహించడం లేదని, అభిమానులు గమనించాలని కోరారు.
Similar News
News December 31, 2025
ఇకపై అన్నీ మదనపల్లెలోనే..?

అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె నేటి నుంచి అమల్లోకి రానుంది. ఇక్కడి నుంచే పాలన కొనసాగనుంది. మదనపల్లెలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టరేట్ ఏర్పాటు చేయనున్నారు. రాయచోటిలో నిన్న ఎస్పీ ధీరజ్ చివరి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. జిల్లా పోలీస్ గ్రీవెన్స్ ఇకపై మదనపల్లెలోనే జరిగే అవకాశం ఉందని చెప్పారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ సైతం ఇకపై మదనపల్లె నుంచే తన డ్యూటీ నిర్వహిస్తారు.
News December 31, 2025
నేటి నుంచే పోలవరం జిల్లా

రంపచోడవరం కేంద్రంగా డిసెంబర్ 31 నుంచి పోలవరం జిల్లా అమలులోకి వస్తుందని ప్రభుత్వం తుది నోటిఫికేషన్ మంగళవారం జారీ చేసిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. పోలవరం పేరుతో ఈ జిల్లా పిలువబడుతోందని వెల్లడించారు. ఈ ప్రాంత ప్రజల అభీష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
News December 31, 2025
SKLM: జనవరి 2 నుంచి కొత్త పాస్‌పుస్తకాల పంపిణీ

శ్రీకాకుళం జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పాత భూహక్కు పత్రాల స్థానంలో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీకి రంగం సిద్ధమైందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం తెలిపారు. జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ప్రత్యేకంగా రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించి వీటిని అందజేయనున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 652 గ్రామాల్లో మొత్తం 2,54,218 పుస్తకాలను పంపిణీ చేయనున్నారని స్పష్టం చేశారు.


