News April 24, 2024

దేశంలో ఎత్తైన హనుమాన్ విగ్రహమిదే!

image

దేశంలోనే అతిపెద్ద ఆంజనేయస్వామి విగ్రహం ఏపీలో ఉంది. శ్రీకాకుళం జిల్లా మడపంలో 176 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ హనుమాన్ విగ్రహ నిర్మాణానికి సుమారు రూ.కోటి ఖర్చు చేశారు. బిదనగెరె (కర్ణాటక) 161 అడుగులు, పరిటాల (ఏపీ) 135, ఒడిశాలోని దమంజోడి హనుమాన్ 108.9, సిమ్లాలోని జాఖూ హిల్ హనుమాన్ 108, ఢిల్లీలోని శ్రీ సంకట్ మోచన్ హునుమాన్ 108 అడుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Similar News

News January 9, 2026

మళ్లీ పెరిగిన బంగారం ధర!

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ మొత్తం రూ.1,310 పెరిగి రూ.1,39,310కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,200 ఎగబాకి రూ.1,27,700 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4వేలు తగ్గి రూ.2,68,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News January 9, 2026

మోదీ, ట్రంప్ 8 సార్లు మాట్లాడుకున్నారు: విదేశాంగ శాఖ

image

భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడానికి మోదీ <<18806375>>ఫోన్ చేయకపోవడమే<<>> కారణమని US వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ చేసిన వ్యాఖ్యలను ఇండియా ఖండించింది. ‘వాణిజ్య ఒప్పందంపై గతేడాది ఫిబ్రవరి నుంచి 2 దేశాలు చర్చలు జరిపాయి. చాలాసార్లు మేం డీల్‌కు చేరువయ్యాం. చర్చలపై తాజాగా చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదు. గతేడాది మోదీ, ట్రంప్ 8సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ చెప్పారు.

News January 9, 2026

అస్సోం రైఫిల్స్‌ 95 పోస్టులకు నోటిఫికేషన్

image

<>అస్సోం<<>> రైఫిల్స్ స్పోర్ట్స్ కోటాలో 95 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్ పాసై, అంతర్జాతీయ, జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్, నేషనల్ స్పోర్ట్స్ , ఖేలో ఇండియాలో పతకాలు సాధించినవారు FEB 9 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18- 23 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఫీల్డ్ ట్రయల్, PST, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://assamrifles.gov.in/