News December 31, 2025

ఆయిల్‌పామ్ సాగు, మొక్కల ఎంపికలో జాగ్రత్తలు

image

ఆయిల్‌పామ్ సాగు కోసం 12 నెలల వయసు, 1 నుంచి 1.2మీ ఎత్తు, 20-25 సెం.మీ. కాండము మొదలు చుట్టుకొలత మరియు 12 ఆకులతో ఆరోగ్యంగా ఉన్న మొక్కలను నాటుటకు ఎంపిక చేసుకోవాలి. నాటేటప్పుడు మాత్రమే మొక్కలను నర్సరీ నుంచి తీసుకురావాలి. సమాంతర త్రిభుజాకార పద్ధతిలో ఎకరాకు 57 మొక్కలు (హెక్టారుకు 143 మొక్కలు), చతురస్రాకార పద్ధతిలో ఎకరాకు 50 మొక్కలు (హెక్టారుకు 123 మొక్కలు) నాటుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

Similar News

News January 1, 2026

2026 గురించి నోస్ట్రడామస్ ఏం చెప్పారు?

image

ఫ్రెంచ్ ఫిలాసఫర్ నోస్ట్రడామస్ 2026లో ప్రపంచం పలు విపత్తులను ఎదుర్కోనుందని అంచనా వేశారు. తాను రాసిన Les Prophéties బుక్‌లో వీటిని ప్రస్తావించారు.
1. ప్రపంచ యుద్ధ స్థాయిలో పోరాటాలు.
2. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం.
3. నిర్ణయాధికారం కృత్రిమ మేధ చేతుల్లోకి. (AI ఆధిపత్యం)
4. సముద్రంలో భారీ విపత్తు లేదా ఉద్రిక్తతలు.
5. నీటి సంబంధిత ప్రకృతి విపత్తులు.
** 1566లో తాను మరణిస్తానని ముందుగానే చెప్పారు.

News January 1, 2026

నావల్ డాక్‌యార్డ్‌లో 320 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో 320 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ITI అర్హతగల వారు NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్(DV) ద్వారా ఎంపిక చేస్తారు. MARCH 22న రాత పరీక్ష నిర్వహించి, 25న ఫలితాలు వెల్లడిస్తారు. DV మార్చి 30న, మెడికల్ టెస్ట్ మార్చి 31 న నిర్వహిస్తారు. https://indiannavy.gov.in

News January 1, 2026

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది 1.2 కోట్ల కొలువులు!

image

2026లో ఉద్యోగ నియామకాల జోరు మరింత పెరగనున్నట్లు టీమ్‌లీజ్ అంచనా వేసింది. ఈ ఏడాది సుమారు 1.2 కోట్ల కొత్త కొలువులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. టాటా మోటార్స్, EY, గోద్రేజ్ వంటి దిగ్గజ సంస్థలు క్యాంపస్ హైరింగ్‌తో పాటు టెక్నాలజీ, AI రంగాల్లో భారీగా రిక్రూట్‌మెంట్ చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, విభిన్న ప్రతిభావంతులకు ప్రాధాన్యం ఇస్తూ వైవిధ్యతను పెంచడంపై కంపెనీలు ఫోకస్ పెట్టడం విశేషం.