News December 31, 2025

MHBD: తండ్రి డబ్బులివ్వలేదని కొడుకు ఆత్మహత్య

image

నెల్లికుదురు మండలం మేచరాజుపల్లిలో విషాదం నెలకొంది. తండ్రి డబ్బులు ఇవ్వలేదన్న మనస్తాపంతో కొడుకు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై రమేశ్ బాబు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రాకేష్ తన తండ్రి సంతోష్‌ను రూ.లక్ష అడిగాడు. ప్రస్తుతం తన వద్ద లేవని, రేపు ఇస్తానని తండ్రి చెప్పడంతో క్షణికావేశానికి లోనైన రాకేష్ పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు.

Similar News

News February 5, 2026

ప్రకాశం: బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆర్మీ జవాన్ మృతి

image

కంభం మండలంలోని తురిమెళ్ల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ యేలం వెంకటరమణ (45) అస్సోం రాష్ట్రంలోని దిబ్రూగడ్‌లో బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించారు. విధుల్లో ఉండగా సోమవారం అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నెల రోజుల క్రితమే తండ్రి వేమయ్య మృతి చెందడంతో సొంత గ్రామానికి వచ్చి తండ్రి దశదినకర్మ నిర్వహించిన అనంతరం వెంకటరమణ విధుల్లో చేరారు.

News February 5, 2026

అమలాపురం: వర్క్ STRESSతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ SUICIDE

image

అమలాపురానికి చెందిన సతీశ్(31) మియాపూర్‌లోని BKఎన్‌క్లేవ్‌లోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేస్తున్నాడు. పనిఒత్తిడి తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. సతీశ్‌కు ఏడాది క్రితం వివాహం కాగా భార్య సొంతూరుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

News February 5, 2026

ట్రంప్ బెదిరింపులకు భారత్ తలొగ్గదు.. వెలుగులోకి కొత్త విషయాలు!

image

IND-US ట్రేడ్ డీల్‌పై గతేడాది SEPలో జరిగిన కీలక చర్చల వివరాలు వెలుగులోకి వచ్చాయి. భారత్, PM మోదీపై ట్రంప్, ఉన్నతాధికారులు నోరుపారేసుకోవడాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఖండించినట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ‘50% టారిఫ్‌ల బెదిరింపులకు IND తలొగ్గదు. అవసరమైతే ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు వేచిచూస్తాం. మాపై విమర్శలు తగ్గిస్తేనే సంబంధాలు మెరుగుపడతాయి’ అని తేల్చిచెప్పినట్లు పేర్కొంది.