News December 31, 2025
MBNR: కురుమూర్తిలో నేడు గిరి ప్రదక్షిణ

అమ్మాపూర్ సమీపంలోని ప్రసిద్ధ కురుమూర్తి స్వామి క్షేత్రంలో బుధవారం ఉదయం 10:30 గంటలకు గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి వేడుకను విజయవంతం చేయాలని కోరారు. ‘పేదల తిరుపతి’గా వెలుగొందుతున్న స్వామివారి గిరి ప్రదక్షిణ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నారు.
Similar News
News January 2, 2026
ఖమ్మంలో త్వరలో ‘హరిత’ హోటల్.. స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

ఖమ్మం జిల్లాకు వచ్చే పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం హరిత హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రభుత్వ భూములను పరిశీలించారు. పర్యాటకులకు నాణ్యమైన భోజనం, విడిది సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. అన్ని వసతులతో కూడిన అనువైన స్థలాన్ని త్వరలోనే ఖరారు చేస్తామని పేర్కొన్నారు.
News January 2, 2026
కొత్త వాహనాలకు రోడ్ సేఫ్టీ సెస్: పొన్నం

TG: రోడ్ సేఫ్టీ సెస్‌పై మండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రవాణా శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌ను బలపరిచేందుకు రోడ్ సేఫ్టీ సెస్ విధించాలని నిర్ణయించాం. కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలకు ఇది వర్తిస్తుంది. టూవీలర్స్‌కు రూ.2వేలు, కార్లలాంటి వాటికి రూ.5 వేలు, హెవీ వెహికల్స్‌కి రూ.10వేలు సెస్ విధిస్తాం’ అని తెలిపారు. APలో దీనిని 10%గా నిర్ణయించి క్యాబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది.
News January 2, 2026
మెదక్: ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య

మెదక్ జిల్లా శివంపేట(M) తిమ్మాపూర్‌లో ప్రియుడితో కలిసి భర్త స్వామిని హత్య చేసిన భార్య మౌనిక, ప్రియుడు సంపత్‌లను అరెస్టు చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. వివాహేతర సంబంధంపై భర్తకు తెలియడంతో గొడవలు జరిగాయి. అడ్డు తొలగించుకోవడానికి గత నెల 22న స్వామికి మద్యం తాగించి నిద్రలో ఉండగా భార్య మౌనిక, ప్రియుడు సంపత్ కలిసి హత్య చేసినట్లు వివరించారు. ఇద్దరినీ శుక్రవారం అరెస్టు చేశామన్నారు.


