News December 31, 2025
జుట్టు విపరీతంగా రాలుతోందా?

ఒత్తయిన జుట్టును మహిళలందరూ కోరుకుంటారు. అయితే రక్త హీనత, డైటింగ్, థైరాయిడ్ సమస్యలు, కెమికల్ ప్రొడక్ట్స్, హెయిర్ స్ట్రెయిట్‌నెర్‌ల వాడకం, గర్భధారణ సమయాల్లో విపరీతంగా జుట్టు ఊడిపోతుంది. దీని నివారణకు ఒమేగా-3, జింక్, ప్రొటీన్, ఐరన్ అధికంగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. ఆయిల్‌తో మసాజ్ చేసుకుని గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News January 2, 2026
INC, BRS హోరాహోరీ ‘ప్రిపేర్’ అయ్యాయి కానీ…

CM హోదాలో గతంలో KCR కృష్ణా జలాలపై చర్చ పెడితే ‘ప్రిపేర్’ కాలేదని అప్పటి విపక్ష నేత ఉత్తమ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై కేసీఆర్ సెటైర్లూ వేశారు. మళ్లీ ఇదే అంశం ఇప్పుడు చిచ్చు రేపగా INC, BRS హోరాహోరీ ప్రిపేరయ్యాయి. మంత్రి ఉత్తమ్ వారం నుంచీ ఇదే పనిలో ఉన్నారని CM చెప్పారు. తీరా అసెంబ్లీ ఆరంభం కాగా KCR రాలేదు. శాసనసభలో చర్చా లేదు. చివరకు ఇరుపార్టీల ప్రిపరేషన్ మొత్తం వృథా అయింది.
News January 2, 2026
రన్ తీస్తూ కిందపడ్డ సుదర్శన్.. విరిగిన పక్కటెముక

టీమ్ ఇండియా యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ తీవ్ర గాయంతో బాధపడుతున్నారు. VHTలో తమిళనాడు తరఫున బరిలో దిగిన అతడు MPతో మ్యాచులో రన్ తీస్తూ కిందపడ్డారు. దీంతో పక్కటెముక విరిగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సాయి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రికవరీ అవుతున్నారు. గాయం నుంచి కోలుకోవడానికి సుమారు 6 వారాలు పట్టనుంది. IPL నాటికి ఫిట్‌నెస్ సాధిస్తాడని క్రికెట్ వర్గాలు తెలిపాయి.
News January 2, 2026
ఫలించిన కృషి.. వెల్లువెత్తిన పెట్టుబడులు

AP: పెట్టుబడుల ఆకర్షణలో CM చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. ఫోర్బ్స్ <<18742857>>విడుదల<<>> చేసిన డేటాలో 25.3% పెట్టుబడులతో దేశంలో టాప్‌లో నిలవడమే ఇందుకు నిదర్శనం. గతేడాది విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో 613 ఒప్పందాలు, రూ.13.26 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ల ఒప్పందాలు కుదిరాయి. CBN, లోకేశ్ పలుమార్లు విదేశాల్లో పర్యటించి స్పెషల్ ఫోకస్ చేయడంతో పెట్టుబడులు వెల్లువెత్తాయి.


