News December 31, 2025

త్వరలో 14వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్: DGP

image

TG: పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు డీజీపీ శివధర్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో 14వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని నిన్న ప్రెస్ మీట్‌లో ప్రకటించారు. ప్రభుత్వానికి ఖాళీల ప్రతిపాదనలు పంపామని, త్వరలో అనుమతి రానుందని చెప్పారు. కాగా రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 3 సార్లు (2016, 2018, 2022) మాత్రమే నోటిఫికేషన్లు విడుదల కావడంతో నిరుద్యోగుల నుంచి ఒత్తిడి వస్తోంది.

Similar News

News January 2, 2026

BRS నిర్ణయంతో సభకు కేసీఆర్ రానట్లే

image

TG: BRS చీఫ్ KCR శాసనసభకు హాజరుకారని తేలిపోయింది. పాలమూరు ప్రాజెక్టు, కృష్ణా జలాలపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన KCR తొలిరోజు సభలో 3 ని.లు మాత్రమే ఉన్నారు. ఇవాళ రెండో రోజు సమావేశానికీ హాజరు కాలేదు. మరోవైపు ప్రస్తుత సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు BRS కూడా ప్రకటించడంతో ఇక రారనేది స్పష్టమైంది. కాగా కేసీఆర్ సభకు వస్తారని భావించి కాంగ్రెస్ సిద్ధమైంది. ఆయన సభకు రాకపోవడాన్ని CM రేవంత్ తప్పుబట్టారు.

News January 2, 2026

IIIT పుణేలో రీసెర్చ్ పోస్టులు

image

<>IIIT<<>> పుణే 9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్-పార్ట్‌నర్‌షిప్స్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్షియేటివ్‌లో భాగంగా సైబర్ సెక్యూరిటీ పరిశోధన కోసం వీటిని భర్తీ చేయనుంది. పోస్టును బట్టి PhD, ME/MTech/MCA, BE/B.Tech, MSc, GATE/NET ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 14వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://www.iiitp.ac.in/

News January 2, 2026

పాడి పశువుల పోషణలో పచ్చిమేత ప్రాముఖ్యత

image

పచ్చి మేతలో విటమిన్-A అధికంగా ఉంటుంది. దీని వల్ల పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉండి సకాలంలో యుక్త వయసుకు వచ్చి యద లక్షణాలు చూపించి చూలు కడతాయి. రైతు తనకున్న పొలంలో 1/10 వంతులో పశుగ్రాసాన్ని సాగు చేస్తే పశువుల పోషణ ఖర్చు 25-30 శాతం తగ్గి.. పాల నుంచి వచ్చే ఆదాయం 20-30% వరకు పెరుగుతుంది. పచ్చిమేత వల్ల పశువుల జీర్ణక్రియ మెరుగ్గా జరిగి పోషకాలు బాగా అంది పాల దిగుబడి కూడా పెరుగుతుంది.