News December 31, 2025
విజయవాడ: ఆద్విక ట్రేడింగ్ కేసులో ఏజెంట్ అరెస్ట్

చీటింగ్ కేసులో సంచలనం సృష్టించిన అద్విక ట్రేడింగ్ కంపెనీ ఏజెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు.. రామిరెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్‌లో స్థిర పడ్డాడు. ఈ క్రమంలో ఆయన 140 మందిని ఆద్వికలో జాయిన్ చేసి రూ.2 కోట్ల మేర కమిషన్ రూపంలో పొందాడు. కమిషన్ తిరిగి ఇవ్వాలని పోలీసులు రామ్ రెడ్డిని కోరారు. ఆయన నిరాకరించడంతో వెంటనే అతనిని అరెస్ట్ చేశారు.
Similar News
News January 3, 2026
వికారాబాద్‌లో వనమూలికల ఉన్నాయని తెలుసా?

వికారాబాద్ అటవీ ప్రాంతంలో ఔషధ గుణాలు కలిగిన అనేక చెట్లు, మొక్కలు విరివిగా ఉండటంతో అక్కడి వాతావరణం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నమ్మేవారు. ఈ చెట్ల వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుందని, ఊపిరితిత్తులు బలపడతాయని భావించి 1920 ప్రాంతంలో టీబీ రోగులు వికారాబాద్ అడవులకు వెళ్లి కొంతకాలం నివసిస్తూ ఆరోగ్యం మెరుగుపడుతుందని అక్కడే నివసించేవారట. మీరూ దీని గురించి విన్నారా?
News January 3, 2026
GHMC ట్యాక్స్ చెల్లింపులు పూర్తిగా ఆన్‌లైన్‌లో

GHMCలో విలీనమైన ప్రాంతాల్లో ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల చెల్లింపులు ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరగాలని GHMC స్పష్టం చేసింది. నగదు లావాదేవీలకు పూర్తిగా చెక్ పెట్టినట్లు ప్రకటించింది. UPI, డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్‌తో చెల్లింపులు స్వీకరిస్తామని తెలిపింది. కొత్త విధానానికి సహకరించాలని ప్రజలను విజ్ఞప్తి చేసింది. ఇకపై ఒకే పన్ను వసూలు విధానం అమల్లోకి వచ్చింది.
News January 3, 2026
ఏ పంటలకు చెదపురుగుల బెడద ఎక్కువ?

కలప సంబంధిత వృక్ష జాతులు, ధాన్యపు పంటలు, మామిడి, కొబ్బరి, కోకో, ద్రాక్ష, చెరకు తోటలను చెదపురుగులు ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. పంట నారుమడి దశ నుంచి పూర్తిగా ఎదిగే వరకూ చెదపురుగుల ముప్పు ఎక్కువే. ఇవి నేలలో సొరంగాలు చేసుకొని, నేలపై పుట్టలు పెట్టి జీవిస్తాయి. ఇవి మొక్కల వేర్లను, భూమికి దగ్గరగా ఉండే కాండపు భాగాలను, పెద్ద వృక్షాల బెరడును తినడం వల్ల మొక్కలు, చెట్లు చనిపోయి నష్టం కలుగుతుంది.


