News December 31, 2025

NTR: మట్టి తవ్వకాలు.. సంపద దోపిడీ షురూ.!

image

మైలవరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. కొత్తూరు, తాడేపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా 35ఎకరాల అసైన్డ్ భూముల్లో తవ్వకాలు జరుపుతూ ప్రకృతి సంపదను దోచేస్తున్నారు. గతంలో మైనింగ్ అధికారులు రూ.150కోట్ల రికవరీ నోటీసులు ఇచ్చి, ఆంక్షలు విధించినా అధికార పార్టీ నేతల అండతో దందా నిరాటంకంగా సాగుతోంది. CM చంద్రబాబు ‘సంపద సృష్టి’ అంటుంటే, క్షేత్రస్థాయిలో నేతలు ‘సంపద దోపిడీ’ చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.

Similar News

News January 3, 2026

రోహిత్, కోహ్లీలను సెలక్ట్ చేస్తే..

image

జనవరి 11, 14, 18 తేదీల్లో న్యూజిలాండ్‌తో జరిగే 3 వన్డేల సిరీస్ కోసం నేడు బీసీసీఐ భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. గతేడాది ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీసులతో పాటు విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టిన సీనియర్లు రోహిత్, కోహ్లీలపైనే అందరి దృష్టి ఉంది. వారిని సెలక్ట్ చేస్తే 2027 వన్డే WC జట్టులో ఉంటారని బీసీసీఐ పరోక్షంగా సంకేతాలు పంపినట్లు అవుతుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

News January 3, 2026

ఖమ్మం: సర్వం సిద్ధం.. నేటి నుంచి టెట్ పరీక్షలు

image

ఖమ్మం నగరంలో టెట్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు జరిగే పరీక్షలకు 9 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని తెలిపారు. ఉ.9 నుంచి 11 వరకు ఒక సెషన్, మ.2 నుంచి సా.4:30 వరకు మరో సెషన్ లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. కాగా పరీక్షలకు మొత్తం 20,547 మంది విద్యార్ధులు హాజరుకానున్నారని పేర్కొన్నారు.

News January 3, 2026

MDK: భారీగా పొగమంచు.. బయటకు రాకండి..!

image

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం వేళ రహదారులపై దృశ్యమానత తీవ్రంగా తగ్గడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల గుండా ప్రయాణించే ద్విచక్ర వాహనాలు, కార్లు నెమ్మదిగా సాగుతున్నాయి. ప్రమాదాలు జరగకుండా వేగ నియంత్రణ పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని, పొగమంచు తగ్గాక వస్తే బెటర్ అని అటవీ, ట్రాఫిక్ అధికారులు సూచిస్తున్నారు.