News April 24, 2024
హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమైపోయింది: మోదీ
ప్రధాని మోదీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మీ ఆస్తులను దోచేసి వాటిని కొందరికి పంచాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. వారి హయాంలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమైపోయింది. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల గురించి బయటపెట్టాను. దీంతో కాంగెస్, ఇండియా కూటమి నన్ను దూషించడం మొదలుపెట్టాయి’ అని రాజస్థాన్‌లోని టోంక్ సభలో పేర్కొన్నారు. ఇటీవల బన్‌స్వారా పర్యటనలోనూ మోదీ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.
Similar News
News November 20, 2024
జపాన్‌లో తొలి మూడేళ్లు పిల్లలకు పరీక్షలే ఉండవు!
పిల్లలు పుట్టగానే వారిని ఇంజినీర్ లేదా డాక్టర్ చేయించాలని చాలా మంది అనుకుంటుంటారు. రూ.లక్షలు చెల్లించి స్కూల్‌లో జాయిన్ చేయించి మార్కులు, గ్రేడ్స్ అంటూ వారిని అప్పటి నుంచే ఇబ్బంది పెడుతుంటారు. కానీ, జపాన్‌లో అలా కాదు. అక్కడి పిల్లలకు స్కూల్‌లో మొదటి మూడేళ్లు పరీక్షలు, గ్రేడ్స్ ఉండవు. కేవలం మంచి మర్యాదలు నేర్పిస్తారు. ఒకరినొకరు గౌరవించుకోవడం, ఉదారంగా ఉండటం, ప్రకృతి పట్ల దయగా ఉండటం నేర్పిస్తారు.
News November 20, 2024
ఒక్కో బందీకి రూ.42కోట్లిస్తాం: గాజా ప్రజలకు నెతన్యాహు బంపర్ ఆఫర్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజా ప్రజలకు టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చారు. హమాస్ చేతిలో బందీలైన తమ పౌరులను తీసుకొస్తే ఒక్కొక్కరికి రూ.42కోట్ల ($5M) చొప్పున ఇస్తామని ప్రకటించారు. ‘ఘర్షణ వద్దనుకుంటున్న వారికి నేను చెప్పేదొకటే. బందీలను తీసుకురండి. డబ్బులిచ్చి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని క్షేమంగా పంపించేస్తాం. ఏ దారి ఎంచుకుంటారో మీ ఇష్టం. మేమైతే బందీలను కచ్చితంగా విడిపిస్తాం’ అని గాజా తీరంలో తెలిపారు.
News November 20, 2024
వజ్రాలను వెతుక్కొని ఇంటికి తీసుకెళ్లొచ్చు!
అమెరికాలోని ఆర్కాన్సాస్‌లో ఉన్న ‘డైమండ్స్ స్టేట్ పార్క్’లో పర్యాటకులు వజ్రాలను వెతుక్కోవచ్చు. ముప్పైఏడున్నర ఎకరాల డైమండ్ ల్యాండ్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ పార్క్స్ అండ్ టూరిజం 1972లో కొనుగోలు చేసింది. అప్పటి నుంచి టూరిస్టులు ఇక్కడకు వచ్చి వారు కనుగొన్న వజ్రాలను తీసుకెళ్తున్నారు. ఏటా 600కు పైగా అన్‌కట్ డైమండ్స్ ఇక్కడ లభిస్తున్నాయి. 40 క్యారెట్ల కంటే ఎక్కువగా ఉన్న వజ్రం ఇక్కడ దొరికినదాంట్లో అతిపెద్దది.