News December 31, 2025
కర్నూలు జిల్లాలో ఏడాదిలో 658 ప్రమాదాలు

కర్నూలు జిల్లాలో గత ఏడాది కంటే 2025లో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024లో 547 ప్రమాదాలు జరగగా, 2025లో ఆ సంఖ్య 658కి చేరింది. ముఖ్యంగా చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది సజీవదహనం కావడం జిల్లాను కలచివేసింది. అలాగే డిసెంబరు 2న సంతోష్‌నగర్ వద్ద జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పెరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
Similar News
News January 2, 2026
94 వేల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ: కలెక్టర్

కర్నూలు జిల్లాలోని 141 గ్రామాల్లో జనవరి 2 నుంచి 9 వరకు నిర్వహించే రెవెన్యూ గ్రామ సభలలో రైతులకు రాజముద్రతో కూడిన 94,090 నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. పాత భూహక్కు పత్రాల స్థానంలో ఇవి అందజేస్తామని పేర్కొన్నారు. శుక్రవారం కల్లూరు మండలం తడకనపల్లెలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రైతులకు పాస్‌పుస్తకాలు అందజేశారు.
News January 2, 2026
కర్నూల్: కలెక్టర్ బంగ్లాలో న్యూ ఇయర్ వేడుకలు

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కలెక్టర్ బంగ్లాలో రెవెన్యూ, విద్యాశాఖ, పోలీస్ శాఖలతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా 2026లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సలహాలు సూచనలు చేశారు.