News December 31, 2025
మేడిపల్లి: దొరికిన దొంగలు.. సొత్తు స్వాధీనం

మేడిపల్లి పరిధిలో ఈనెల 24న అర్ధరాత్రి మహాలక్ష్మి మొబైల్ షాప్‌లో 9 సెల్‌ఫోన్లు, 27న అర్ధరాత్రి కోరుట్ల పట్టణంలోని హాజీపూర్‌లో మోటార్ సైకిల్ చోరీ చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పడాల దినేశ్, అర్షద్ ఖాన్, పిట్టల అరవింద్, జగదీశ్వర్‌లను మేడిపల్లి శివారులో పట్టుకుని వారి వద్ద నుంచి 9 సెల్‌ఫోన్లు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు.
Similar News
News January 2, 2026
జీవీఎంసీ స్థాయి సంఘంలో 109 అంశాలకు ఆమోదం

జీవీఎంసీలో శుక్రవారం స్థాయి సంఘం సమావేశం నిర్వహించారు. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన 109 అంశాలకు ఆమోదం తెలిపారు. సమావేశంలో ప్రధాన అజెండాలో 87 అంశాలు, 52 టేబుల్ అజెండా అంశాలతో పాటు మొత్తం 139 అంశాలు పొందుపరచగా, వాటిని స్థాయి సంఘం సభ్యులు క్షుణ్ణంగా చర్చించి వివిధ కారణాలు వలన 30 అంశాలు వాయిదా వేశారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి సుమారు రూ.26.46 కోట్ల అభివృద్ధి పనులకు సభ్యులు ఆమోదం తెలిపారు.
News January 2, 2026
టెట్ కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు: సూర్యాపేట ఎస్పీ

సూర్యాపేట జిల్లాలో ఈనెల 3 నుంచి 20 వరకు జరిగే టెట్ పరీక్షల నేపథ్యంలో కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో గుంపులుగా ఉండొద్దని, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. ఎలాంటి ర్యాలీలు, సభలకు అనుమతి లేదని, పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
News January 2, 2026
ఇంట్లోని ఈ వస్తువులు యమ డేంజర్!

మనం శుభ్రంగా ఉంటాయని భావించే వస్తువులే బ్యాక్టీరియాకు అసలైన నిలయాలు. పబ్లిక్ టాయ్‌లెట్ సీటు కంటే సూపర్ మార్కెట్ <<18742127>>ట్రాలీలు<<>>, ATM & లిఫ్ట్ బటన్లపై 40 రెట్లు ఎక్కువ క్రిములుంటాయని సర్వేలు చెబుతున్నాయి. మొబైల్స్, ఆఫీస్ కీబోర్డులు, వంటగదిలోని స్పాంజ్‌లు, రిమోట్లు ఇన్ఫెక్షన్లకు కారకాలు. వందల మంది తాకే ఈ వస్తువుల ద్వారా 80% వ్యాధులు వ్యాపిస్తాయి. కాబట్టి వీటిని వాడాక చేతులను శానిటైజ్ చేసుకోవడం బెటర్.


