News December 31, 2025

నాగర్‌కర్నూల్‌లో తగ్గిన చలి తీవ్రత

image

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో గత కొన్ని రోజులుగా వణికిస్తున్న చలి తీవ్రత బుధవారం కాస్త తగ్గింది. గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. అమ్రాబాద్‌, కల్వకుర్తిలో అత్యల్పంగా 12.4 డిగ్రీలు నమోదు కాగా, బిజినపల్లిలో 12.6, నాగర్‌కర్నూల్‌లో 13.5, తాడూరులో 13.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం పెరగడంతో చలి ప్రభావం స్వల్పంగా తగ్గుముఖం పట్టిందని అధికారులు తెలిపారు.

Similar News

News January 2, 2026

కొల్లూరు: ‘రూ.11 లక్షల అప్పు చెల్లించాలన్నందుకు దాడి’

image

ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వాలని అడిగినందుకు దౌర్జన్యం చేసిన కుటుంబంపై కేసు నమోదు చేసినట్లు కొల్లూరు హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు తెలిపారు. గురువారం ఆయన వివరాల మేరకు.. కొల్లూరుకు చెందిన రాజేశ్వరి వద్ద గూడూరు శ్రీనివాసరావు కుటుంబం రూ.17 లక్షలు ఆప్పు తీసుకుంది. వాటిలో రూ.6 లక్షలు చెల్లించారు. మిగిలిన రూ.11 లక్షలు ఇవ్వాలని రాజేశ్వరి వారిని అడగగా దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి దిగారు. ఘటనపై కేసు నమోదైంది.

NZB: గల్ఫ్ కార్మికులకు గుడ్ న్యూస్

image

గల్ఫ్ దేశాల్లోని వలస కార్మికుల పనికి తగిన వేతనం ఇవ్వాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE ప్రభుత్వం నిర్ణయించింది. జీతాల పెరుగుదల కోసం ఇతర దేశాలకు వలసలు పెరగడంతో కొరత రాకుండా చట్టంలో మార్పులు చేసింది. నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు లక్ష మందికి అక్కడ పనిచేస్తున్నారు. వారికి జీతాలు పెరగనున్నాయి. ఈ నిర్ణయంపై ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల హర్షం వ్యక్తం చేశారు.