News April 24, 2024
రేపటి నుంచి సెలవులు

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. 2023-24 విద్యాసంవత్సరంలో నేడు చివరి పని దినం. ఇవాళ 1-9వ తరగతుల విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. 2024-25 విద్యాసంవత్సరంలో జూన్ 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయి.
Similar News
News March 14, 2026
4 రోజులుగా ICUలో తమ్మినేని వీరభద్రం

TG: CPI(M) కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం గత 4 రోజులుగా గచ్చిబౌలి (HYD) AIG హాస్పిటల్‌లో ICUలో చికిత్స పొందుతున్నారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు BV.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ఇతర నాయకులు హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, 2 రోజుల్లో కోలుకుంటారని డాక్టర్లు తెలిపారు.
News March 14, 2026
ప్రజల్లో భయాందోళనలకు కాంగ్రెస్ యత్నం: మోదీ

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం దేశ ప్రజలపై పడకుండా చర్యలు తీసుకుంటున్నామని PM మోదీ తెలిపారు. ఇలాంటి సందర్భంలో భయాందోళనలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అస్సాంలోని సిల్చార్‌లో మాట్లాడుతూ ‘దేశ ప్రయోజనాల విషయంలో INC మళ్లీ విఫలమైంది. నాపై దుర్భాషలాడేందుకే ప్రాధాన్యం ఇస్తోంది. దేశాభివృద్ధిని జీర్ణించుకోలేని శక్తుల చేతుల్లో కాంగ్రెస్ కీలుబొమ్మగా మారుతోంది’ అని పేర్కొన్నారు.
News March 14, 2026
ఒక్కరోజే 2,37,123 గ్యాస్ సిలిండర్ల పంపిణీ

TG: డొమెస్టిక్ సిలిండర్ల డెలివరీకి సమస్య రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా 2,37,123 గ్యాస్ సిలిండర్లు పంపిణీ అయ్యాయి. సాధారణంగా జరిగే రోజువారీ సగటు పంపిణీ కంటే ఇది 12K సిలిండర్లు అధికం కావడం విశేషం. IOCL 83,166, HPCL 88,257, BPCL 65,700 గ్యాస్ సిలిండర్లను సరఫరా చేశాయి. GOVT కఠిన చర్యల ఫలితంగా బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్టపడింది.


