News December 31, 2025

న్యూ ఇయర్.. ప్రత్యేక తనిఖీలు: VKB SP

image

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ సందర్భంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో SHOలు ప్రత్యేక బృందాలతో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్, విస్తృత వాహన తనిఖీలు నిర్వహిస్తారని SP స్నేహ మెహ్రా తెలిపారు. వేడుకల ముసుగులో ఎక్కడైనా ఈవ్ టీజింగ్ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు.

Similar News

News January 2, 2026

ఐఐటీ, నీట్‌లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ

image

ఐఐటీ, నీట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన శ్రీచైతన్య HNK (స్నేహానగర్) పూర్వ విద్యార్థులను మంగళవారం సన్మానించారు. ఐఐటీ బాంబేలో ప్రవేశం పొందిన సాయి రిషాంత్ (6వ ర్యాంకు), రష్మిత (7వ ర్యాంకు)లకు రూ.5 లక్షల చొప్పున, ఎయిమ్స్ ఢిల్లీలో సీటు సాధించిన షణ్ముక్ (11వ ర్యాంకు)తో పాటు త్రిశూల్, నితిన్ రెడ్డికి రూ.లక్ష చొప్పున నగదు బహుమతులు అందజేశారు. ఛైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ACP ప్రశాంత్ పాల్గొన్నారు.

News January 2, 2026

ఎన్గల్ గ్రామ శివారులో చిరుత సంచారం..?

image

చందుర్తి మండలం ఎన్గల్ గ్రామ శివారులో చిరుతపులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. రెండు రోజుల కింద హన్మాజీపేట శివారులోని రైస్ మిల్ వద్ద చిరుతపులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించి, చిరుత సంచారం నిజమేనని నిర్ధారించారు. ఈ క్రమంలో ఎన్గల్ గ్రామ శివారులో చిరుత సంచరించడం గమనించినట్లు ప్రచారం జరగడంతో గ్రామస్థులు, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారాన్ని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.

News January 2, 2026

పెద్దపల్లిలో PM విశ్వకర్మ లబ్ధిదారులకు అవగాహన శిక్షణ

image

పెద్దపల్లిలో MSME-DFO ఆధ్వర్యంలో PM విశ్వకర్మ పథకం లబ్ధిదారుల కోసం శుక్రవారం ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సంప్రదాయ వృత్తిదారులు, కళాకారుల సామర్థ్య అభివృద్ధే లక్ష్యంగా ఈ శిక్షణ జరిగింది. ముఖ్య అతిథిగా వడ్డేపల్లి రాంచందర్ పాల్గొన్నారు. ఉత్పత్తి డిజైనింగ్, లేబులింగ్, మార్కెటింగ్ అవకాశాలు, అమ్మకాల వ్యూహాలు, డిజిటల్ లావాదేవీలకు QR కోడ్ వినియోగంపై ప్రాయోగిక అవగాహన కల్పించారు.