News December 31, 2025

సర్వీస్ ఛార్జ్ బాదుడు.. రెస్టారెంట్‌కు ₹50,000 ఫైన్

image

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్ వసూలు చేసినందుకు ముంబైలోని బోరా బోరా రెస్టారెంట్‌కు CCPA ₹50,000 ఫైన్ వేసింది. కస్టమర్ అనుమతి లేకుండానే 10% సర్వీస్ ఛార్జ్ కలిపింది. దానిపై అదనంగా GST కూడా వసూలు చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధమని CCPA స్పష్టం చేసింది. సర్వీస్ ఛార్జ్ పూర్తిగా స్వచ్ఛందమని గుర్తుచేసింది. దీన్ని హోటళ్లు, రెస్టారెంట్ తప్పనిసరి చేయొద్దని ఢిల్లీ హైకోర్టు గతంలోనే తీర్పిచ్చింది.

Similar News

News February 20, 2026

2028 SEP కల్లా ఐకానిక్ టవర్స్ రెడీ: నారాయణ

image

AP: అమరావతిలో సెక్రటేరియేట్ కోసం నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్‌ను 2028 SEP కల్లా రెడీ చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ‘గతంలో 26,700 మంది ఉద్యోగులకు వీలుగా 52.72 L చ‌.అ. బిల్ట్ అప్ ఏరియా, 31.71 L చ‌.అ. కార్పెట్ ఏరియాతో వీటిని డిజైన్ చేశారు. ఇప్పుడు ఉద్యోగులు 39,882 మంది ఉన్నారంటున్నారు. నయా రాయ్‌పుర్, HYD సచివాలయ, సెంట్రల్ విస్టాను పరిశీలించాలని అధికారులకు సూచించాం’ అని సచివాలయంలో చెప్పారు.

News February 20, 2026

TG EDCET-2026 నోటిఫికేషన్ విడుదల

image

TG: రాష్ట్రంలో రెండేళ్ల బీఈడీ కోర్సులో చేరేందుకు TG EDCET-2026 నోటిఫికేషన్ రిలీజైంది. కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో CBT విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు అవకాశం ఉంది. మే 12వ తేదీ 2 సెషన్లలో ఎగ్జామ్ ఉంటుంది. కనీసం 50 మార్కులతో బ్యాచ్‌లర్ డిగ్రీ ఉన్నవాళ్లే అప్లై చేసుకునేందుకు అర్హులు.

News February 20, 2026

టెన్త్ స్టూడెంట్ల పేర్లలో తప్పుల సవరణకు ఛాన్స్

image

AP: టెన్త్ విద్యార్థుల పేర్లు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, జెండర్ వివరాల్లో తప్పులుంటే స్కూళ్ల ఐడీల ద్వారా HMలు ఈనెల 21లోపు సరిచేయాలని బోర్డు సూచించింది. బోర్డు అందించే లింకుల్లో వీటిని సమర్పించాలంది. కరెక్షన్స్‌ను విద్యార్థులు, పేరెంట్స్ కూడా సరిచూసుకోవాలని పేర్కొంది. ఈ పరీక్షలకు 6 లక్షల మంది హాజరుకానున్నారు.