News December 31, 2025
పల్నాడు: ఆ ప్రాజెక్టుల పనుల్లో ప్రగతి

2025 ఏడాది జిల్లాలో ఎన్నో ఏళ్లు పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణంలో ప్రగతి కనిపించింది. ముఖ్యంగా దశాబ్దాలుగా ఊరిస్తున్న వరకపూడి శెలకు సంబంధించి భూసేకరణకు అటవీ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14 కోట్లు చెల్లించింది. మాచర్ల ఎత్తిపోతల అభివృద్ధికి సంబంధించి జిప్‌లైన్ పనులను కోటి రూపాయలతో ప్రారంభించారు. నాగార్జునసాగర్ పర్యాటకానికి కేంద్రం దర్శన్ 2.0లో రూ.25 కోట్లు కేటాయించారు.
Similar News
News January 15, 2026
టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ

NZతో జరిగే 5 మ్యాచ్‌ల T20 సిరీస్‌కు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమయ్యారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇప్పటికే చివరి రెండు వన్డేలకు దూరమైన సుందర్.. ఇప్పుడు టీ20లకు సైతం అందుబాటులో ఉండటం లేదు. జనవరి 21 నుంచి T20 సిరీస్ ప్రారంభం కానుంది. మరోవైపు ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న T20 వరల్డ్‌కప్‌కు ముందు ఇది ఆందోళన కలిగించే అంశంగా మారింది.
News January 15, 2026
‘ఆదోనికి మీరే దిక్కు సీఎం చంద్రబాబూ..’

ఆదోని జిల్లా సాధన కోసం చేపట్టిన దీక్ష ఇవాళ 60వ రోజుకు చేరుకున్న సందర్భంగా సంతేకుడ్లూరు గ్రామ యువతతో పాటు జేఏసీ నాయకులు దీక్షలో పాల్గొని ఉద్యమానికి మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తమకు దిక్కు అంటూ కళాకారుడు జగదీశ్ వేసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో జేఏసీ నాయకులు నూర్ అహ్మద్, షకీల్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
News January 15, 2026
రూ.1,499కే ఇండిగో విమాన టికెట్

విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు ఆకర్షణీయ ఆఫర్‌ను ప్రకటించింది. ‘Sail into 2026’ పేరుతో దేశీయ రూట్లలో ఒకవైపు విమాన టికెట్ ధరను కేవలం రూ.1,499గా నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రారంభ ధర రూ.4,499గా వెల్లడించింది. ఈ ఆఫర్ ఈ నెల 16 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు జనవరి 20 నుంచి ఏప్రిల్ 30 మధ్య ఎప్పుడైనా ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది.


