News December 31, 2025
వనపర్తిలో మరోసారి ఎన్నికలు.!

వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో పోలింగ్‌కు అధికారులు సిద్ధం అవ్వాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 2011 జనాభా లెక్కల ప్రకారం..
✓ వనపర్తి- 33 వార్డుల్లో 70,416 మంది జనాభా
✓ పెబ్బేరు- 12 వార్డుల్లో 15,602 మంది
✓ కొత్తకోట- 15 వార్డుల్లో 19,042 మంది
✓ ఆత్మకూర్- 10 వార్డుల్లో 15,039 మంది
✓ అమరచింత- 10 వార్డుల్లో 11,225 మంది.
ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేయనున్నారు.
Similar News
News January 12, 2026
చిత్తూరు కలెక్టరేట్‌లో ప్రారంభమైన PGRS

చిత్తూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కార దిశగా సంబంధిత అధికారులకు ఫిర్యాదులపై బాధితుల ముందే పరిష్కరిస్తున్నారు. మండల స్థాయిలోనే ఫిర్యాదులు పరిష్కారం అవ్వాలని ఆదేశించారు. డీఆర్ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్ పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు.
News January 12, 2026
ఈనెల 16న నిర్మల్‌కు సీఎం

సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 16న నిర్మల్ జిల్లాలో పర్యటిస్తారని కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కూచాడి శ్రీహరి రావు తెలిపారు. మామడ మండలం పొన్కల్ గ్రామంలో గోదావరి నదిపై నిర్మించిన సదర్మట్ బ్యారేజీను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలన్నారు.
News January 12, 2026
మేడారం జాతరలో ఏ రోజు ఏ పండగ అంటే..?

మేడారం జాతరలో ఏ రోజు ఏ పండగ చేసేది గిరిజన పూజారులు వివరించారు. ఈనెల 14న గుడిమెల్లంక పండగ, 21న మండమెలిగే పండగ, 27న మహబూబాబాద్ జిల్లా పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఆ రోజునే కన్నెపల్లి నుంచి జంపన్న మేడారంలో గద్దెకు చేరుకుంటారు. 28న కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, 29న సమ్మక్క గద్దెకు చేరుకుంటారు. 31న దేవతల వనప్రవేశం ఉంటుంది.


