News December 31, 2025
ఎవరి జోక్యమూ లేదు.. చైనా మధ్యవర్తిత్వ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్

భారత్-పాక్ మధ్య <<18718800>>మధ్యవర్తిత్వం<<>> చేశామన్న చైనా వాదనను భారత్ కొట్టిపారేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం కేవలం రెండు దేశాల సైనిక అధికారుల మధ్య జరిగిన చర్చల ఫలితమేనని స్పష్టం చేసింది. ఇందులో మూడో దేశం జోక్యం చేసుకోలేదని తేల్చి చెప్పింది. ప్రపంచంలోని పలు వివాదాలను పరిష్కరించామన్న చైనా విదేశాంగ మంత్రి.. భారత్-పాక్ ఉద్రిక్తతలనూ తగ్గించామని చెప్పటంతో భారత్ స్పందించింది.
Similar News
News January 23, 2026
బందీలుగా ఉన్న మత్స్యకారులకు ఈనెల 29న విముక్తి

AP: బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులు ఈ నెల 29న విడుదల కానున్నారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అధికారికంగా ప్రకటించింది. విడుదలయ్యే వారిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 14 మంది ఉన్నారు. గత అక్టోబర్ 22న విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించడంతో వీరు అరెస్టయ్యారు.
News January 23, 2026
బ్రెజిల్‌తో భాగస్వామ్యం కొత్త శిఖరాలకు: మోదీ

బ్రెజిల్ అధ్యక్షుడు లూలాతో PM మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ‘కొత్త శిఖరాలను అధిరోహించడానికి సిద్ధంగా ఉన్న IND-బ్రెజిల్ భాగస్వామ్యంపై సమీక్షించాం. గ్లోబల్ సౌత్ ఉమ్మడి ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి మా సహకారం చాలా ముఖ్యం’ అని ట్వీట్ చేశారు. ‘FEB 19-21 మధ్య నా ఢిల్లీ పర్యటనపై డిస్కస్ చేశాం. భౌగోళిక పరిస్థితులు, గాజాలో శాంతి స్థాపన, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చించాం’ అని లూలా పేర్కొన్నారు.
News January 23, 2026
జనవరి 23: చరిత్రలో ఈరోజు

1897: స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జననం
1911: హైదరాబాద్ తొలి మహిళా మేయర్ రాణీ కుముదినీ దేవి జననం
1915: ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థర్ లూయీస్ జననం
1926: శివసేన పార్టీ వ్యవస్థాపకుడైన బాల్ ఠాక్రే జననం
2015: హాస్యనటుడు ఎం.ఎస్. నారాయణ మరణం (ఫొటోలో)


