News December 31, 2025
NZB: పెరిగిన డ్రంక్ & డ్రైవ్ కేసులు

జిల్లాలో మద్యం తాగి పట్టుబడిన కేసులు అధికంగా నమోదయ్యాయి. గతేడాది 8,410 డ్రంకెన్ డ్రైవ్ (DD)కేసులు నమోదుకాగా ఈ యేడాది 17,627 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇక హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వారిపై రూ.2.77 లక్షల కేసులు నమోదు చేశారు. ఓవర్ స్పీడ్ కేసులు 41,128, సెల్ఫోన్ డ్రైవ్ చేస్తూ నమోదైన కేసులు 2643 నమోదయ్యాయి. మైనర్ డ్రైవింగ్ కేసులు 1087 నమోదు చేశారు.
Similar News
News January 12, 2026
NZB: 35 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 35 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించారు. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల SI, CIలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కుని పరిష్కారానికి సూచనలు చేశారు. కాగా ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నట్టు CP చెప్పారు.
News January 12, 2026
NZB: 2025లో రోడ్డు ప్రమాదాల్లో 280 మృతి

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన రోడ్డు భద్రతా మాసోత్సవ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 2024లో 856 ప్రమాదాలు జరిగి 351 మంది మరణించగా, 2025 నవంబరు నాటికి 815 దుర్ఘటనల్లో 280 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మరణాల సంఖ్య తగ్గించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేసి, నిబంధనలపై ప్రజలను చైతన్యపరచాలని ఆదేశించారు.
News January 12, 2026
NZB: ‘ప్రజావాణికి అధికారులందరూ విధిగా హాజరు కావాలి’

‘ప్రజావాణి’ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో అధికారులతో కలిసి ఆమె అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన బాధితులు వివిధ సమస్యలపై మొత్తం 84 ఫిర్యాదులను అందజేశారు. ప్రజా సమస్యల పట్ల అధికారులు బాధ్యతగా వ్యవహరించి, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.


