News December 31, 2025

వల్లభనేని వంశీని అరెస్టు చేస్తారా?

image

AP: YCP నేత, మాజీ MLA వల్లభనేని వంశీని మళ్లీ అరెస్టు చేస్తారా అనే చర్చ జరుగుతోంది. 2024 జూన్ 7న సునీల్‌ అనే వ్యక్తిపై జరిగిన దాడి కేసులో వంశీ ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 17న వంశీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీంతో అప్పటి నుంచి ఆయన కనిపించకపోవడంతో, పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయన 137 రోజులు జైలులో ఉండి వచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News January 15, 2026

‘పెద్ద తప్పు చేశా.. కాపాడండి!’: పాక్ నుంచి సిక్కు మహిళ ఆవేదన

image

తీర్థయాత్ర కోసం పాక్ వెళ్లి అక్కడ పెళ్లి చేసుకున్న సరబ్‌జీత్ కౌర్ అనే భారతీయ మహిళ ఇప్పుడు బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ‘నేను పెద్ద తప్పు చేశాను. ఇక్కడ నా పరిస్థితి బాలేదు. తిండికి, బట్టలకు కూడా ఇబ్బంది పడుతున్నాను. పిల్లల దగ్గరకు వచ్చేస్తా. నన్ను ఇక్కడ వేధిస్తున్నారు. దయచేసి ఇండియాకు తీసుకెళ్లండి’ అంటూ భారత్‌లో ఉన్న తన భర్తకు ఆమె పంపినట్లుగా చెబుతున్న ఆడియో క్లిప్ ఒకటి SMలో వైరలవుతోంది.

News January 15, 2026

ఇరాన్‌పై అమెరికా యుద్ధం?.. సిద్ధంగా డ్రోన్లు, విమానాలు!

image

అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌లో నిరసనకారులపై జరుగుతున్న హింసను అడ్డుకుంటామని హెచ్చరించిన ట్రంప్.. ఇప్పుడు ప్రత్యక్ష సైనిక చర్యకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పశ్చిమాసియాలోని US స్థావరాల నుంచి వందలాది యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఎయిర్ ట్యాంకర్లు ఇరాన్ దిశగా కదులుతున్నట్లు తెలుస్తోంది. అటు ఇరాన్ కూడా ‘ప్రతీకార దాడులు తప్పవు’ అంటూ రివర్స్ వార్నింగ్ ఇచ్చింది.

News January 15, 2026

సన్‌స్క్రీన్ కొనేటప్పుడు ఇవి చూస్తున్నారా?

image

చర్మాన్ని UV రేస్ నుంచి కాపాడే సన్‌స్క్రీన్‌లో కొన్ని పదార్థాలు కలిస్తే హానికరంగా మారతాయంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే ఆక్సిబెంజోన్, మెథాక్సీసిన్నమేట్, అవోబెంజోన్ హార్మోన్లపై ప్రభావం చూపడంతో పాటు క్యాన్సర్‌ కారకాలుగా ఉంటాయి. అందుకే సన్‌స్క్రీన్ కొనేటప్పుడు లేబుల్‌ కచ్చితంగా చెక్ చేయాలని సూచిస్తున్నారు. ✍️సన్‌స్క్రీన్ వల్ల వచ్చే లాభనష్టాల గురించి తెలుసుకోవడానికి <<-se_10014>>వసుధకేటగిరీ<<>>కి వెళ్లండి.