News December 31, 2025

GNT: ఆంధ్రా మిర్చికి అంతర్జాతీయ క్రేజ్

image

ఆంధ్రప్రదేశ్ మిర్చికి అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థలు మన రైతుల నుంచి నేరుగా మిర్చి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. సాస్‌లు, కేఎఫ్‌సీ మసాలాలు, ఫార్మా రంగాల్లో గుంటూరు మిర్చిని విరివిగా వాడుతున్నారు. విదేశీ ప్రతినిధులు పంటను పరిశీలించి మెగా డీల్స్ కుదుర్చుకుంటున్నారు. ఈ ఎగుమతులతో రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి.

Similar News

News January 15, 2026

APలో ఖమ్మం ఎమ్మెల్యేల సందడి

image

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ APలోని నూజివీడు నియోజకవర్గంలో సందడి చేశారు. నూజివీడులో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు వేడుకల్లో ఎమ్మెల్యేలు సతి సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోడిపందాలను వీక్షించారు. అటు సంక్రాంతి పండుగను ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని ఎమ్మెల్యేలు సూచించారు.

News January 15, 2026

ఐనవోలు: మీడియా సెంటర్‌పై నిర్లక్ష్యం..!

image

ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర కవరేజ్ కోసం వచ్చే మీడియా ప్రతినిధులకు అధికారులు మీడియా సెంటర్ ఏర్పాటు చేశారు. కానీ అందులో కుర్చీలు వేయకపోవడంతో ఇతర శాఖలకు చెందిన కార్లు, ద్విచక్రవాహనాలను అందులో పార్కింగ్ చేస్తున్నారు. దీంతో మీడియా ప్రతినిధులకు చోటు లేకుండా పోయింది. ప్రముఖులు దర్శనానికి వచ్చిన సమయంలో మీడియాతో మాట్లాడాలన్నా ఆలయ ఆవరణే దిక్కయింది.

News January 15, 2026

ఇంద్రవెల్లి: ఇక ఈ బాధ్యత.. అల్లుడిదే..!

image

ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద గిరిజనుల జాతరగా పేరుగాంచిన కేస్లాపూర్ నాగోబా జాతర ఈనెల 18న ప్రారంభం కానుంది. మెస్రం వంశీయులు హస్తినమడుగు పవిత్ర గంగాజలాన్ని సేకరించారు. మర్రిచెట్టుపై గంగా జలాన్ని భద్రపరిచారు. కలశం (జారీతాలి) నేలపై జారి పడకుండా మహాపూజలు అయ్యే వరకు చెట్టుపై మెస్రం వంశానికి చెందిన అల్లుడే భద్రపరుస్తుంటారు. ఈనెల 15, 16, 18న మహాపూజ, 22న దర్బార్, 22న పెర్సపేన్ బాన్కక్ పూజలు నిర్వహించనున్నారు.