News December 31, 2025
రేపు వరంగల్ మార్కెట్‌కు సెలవు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం బంద్ ఉండనుంది. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గుమాస్తా, దడవాయి, హమాలీ, వ్యాపారుల కోరిక మేరకు మార్కెట్‌కు సెలవు ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరిగి శుక్రవారం మార్కెట్ పునఃప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. కాగా జిన్నింగు మిల్లులు, సీసీఐ కొనుగోళ్లు యధావిధిగా జరుగుతాయన్నారు.
Similar News
News January 2, 2026
నల్గొండ: పంచాయతీ అకౌంట్లపై అధికారుల దృష్టి..!

ఉమ్మడి నల్గొండ జిల్లా రెండేళ్ల ప్రత్యేకాధికారుల పాలన అనంతరం ఇటీవల గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంతో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన పాలక పంచాయతీల్లో నూతన బ్యాంకు అకౌంట్లు తెరవడంతో పాటు, పాత పంచాయతీల్లో అకౌంట్ల పేర్లు మార్పు చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు పంచాయతీల ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించనున్నారు.
News January 2, 2026
నాగర్‌కర్నూల్: నిబంధనల ప్రకారమే యూరియా పంపిణీ

ఎరువుల డీలర్లు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే యూరియా పంపిణీ చేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. రైతు పట్టా విస్తీర్ణం, సాగు చేస్తున్న పంటను ఏఈఓల ధ్రువీకరణతో అవసరమైన మేరకే విక్రయించాలని సూచించారు. ఈ యాసంగిలో ఇప్పటివరకు జిల్లాలో 14,363 టన్నుల యూరియా పంపిణీ చేశామని, ప్రస్తుతం మరో 3,654 టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.
News January 2, 2026
ANU: BED పరీక్షల షెడ్యూల్.. రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున వర్సిటీ BED మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ శుక్రవారం విడుదలైంది. విద్యార్థులు రూ.2,280ల పరీక్షా ఫీజును ఈనెల 27లోపు చెల్లించాలని అధికారులు సూచించారు. రూ.100 ఆలస్య రుసుంతో ఈనెల 28 వరకు గడువు ఉందని CE తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. MCA, MSC కోర్సుల రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం nagarjunauniversity.ac.in వెబ్‌సైట్‌ను చూడవచ్చన్నారు.


