News December 31, 2025
2025: తెలుగు రాష్ట్రాల్లో వెలుగులు

2025లో AP, TGలు కీలక సంఘటనలకు వేదికలయ్యాయి.
• మే 2: అమరావతి పునర్నిర్మాణానికి PM మోదీ శంకుస్థాపన
• మే 31: Hydలో మిస్ వరల్డ్ పోటీలు.. థాయిలాండ్ సుందరి విజేత
• జూన్ 21: విశాఖలో 3 లక్షల మందితో యోగా దినోత్సవం
• ఆగస్టు 15: APలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం ప్రారంభం
• అక్టోబర్ 14: విశాఖలో గూగుల్ రూ.1.35 లక్షల కోట్ల డేటా సెంటర్ ప్రకటన
• డిసెంబర్ 13: హైదరాబాద్‌లో మెస్సీ సందడి
Similar News
News February 18, 2026
ఫాల్గుణ మాసం: ఈ వ్రతం చేస్తే ఎంతో పుణ్యం

ఫాల్గుణ మాసంలో వయో వ్రతాన్ని ఆచరిస్తారు. దీన్నే ‘సర్వయజ్ఞ ఫలప్రదం’ అంటారు. అదితి దేవి తన కుమారులైన దేవతలకు తిరిగి స్వర్గరాజ్యం లభించాలని ఈ వ్రతాన్ని ఆచరించిందట. అలా వామనుడిని పుత్రుడిగా పొందిందని పురాణ గాథ. కోరిన కోరికలు నెరవేరడానికి, సంతాన ప్రాప్తికి, ఐశ్వర్యాన్ని పొందడానికి, కష్టాల నుంచి విముక్తి కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. దీన్ని అన్ని వ్రతాలలోకెల్లా ఉత్తమమైనదిగా పరిగణిస్తారు.
News February 18, 2026
మలైకా ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

50ఏళ్లు దాటినా ఇంకా ఫిట్ & యంగ్‌గా కనిపిస్తుంటారు బాలీవుడ్ నటి మలైకా అరోరా. ఆమె టోన్డ్ బాడీ, ఫ్లాట్ యాబ్స్, గ్లోయింగ్ స్కిన్ చూస్తే యూత్ కూడా జలసీ ఫీల్ అవ్వాల్సిందే. దీనికోసం యోగాతో పాటు హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT) చేస్తానని మలైకా ఓ ఇంటర్వూలో వెల్లడించారు. వీటితో పాటు పైలేట్స్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఫుల్-బాడీ వర్కౌట్‌లతో సహా వివిధ రకాల వ్యాయామాలను చేయడానికి ఇష్టపడతానని తెలిపారు.
News February 18, 2026
సభ ప్రారంభమైన 5 నిమిషాలకే వాయిదా

AP: శాసనమండలిలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈరోజు సభ ప్రారంభమైన 5 నిమిషాలకే వాయిదా పడింది. ఇందాపూర్ డెయిరీ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ వైసీపీ MLCలు నిరసనకు దిగారు. ఆందోళనల మధ్య ఛైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు. వైసీపీ సభ్యులు దేవుడిపై రాజకీయాలు చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారని హోంమంత్రి అనిత విమర్శించగా, ప్రభుత్వమే శ్రీవారిపై రాజకీయాలు చేస్తోందని YCP పక్షనేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.


